Naga Chaitanya, Ilaiyaraaja: ద్విభాషా చిత్రంలో నాగచైతన్య?

అక్కినేని వారసుడు నాగచైతన్య జోష్ సినిమా ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయమై అనంతరం ఏం మాయ చేశావే వంటి సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు పొందిన నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన థాంక్యూ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా జూలై 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగానే నాగచైతన్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ వెబ్ సిరీస్ అనంతరం నాగ చైతన్య మొదటిసారి ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య తెలుగు తమిళ భాషల్లో ఓ చిత్రం చేయనున్నారు.

అయితే చైతన్య మొట్టమొదటిసారి పూర్తిస్థాయి తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 23వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ సినిమా కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించనున్నారు. ఇళయరాజా గారితో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సైతం ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు.ఇకపోతే ఈ సినిమాకి జూన్ 12వ తేదీ నుంచి చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి.

ఈ మూవీలో నాగచైతన్యతో అరుణ్ విజయ్ విలన్ గా పోటీ పడబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం నాగచైతన్య థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.లవ్ స్టోరీ బంగార్రాజు వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను సందడి చేసిన నాగచైతన్య థాంక్యూ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus