Manjummel Boys: ఇళయరాజాతో ‘కాపీరైట్స్‌’ సమస్య తేల్చుకున్న ‘..బాయ్స్‌’.. ఎంతిచ్చారంటే?

సినిమా పాటల యుందు ఇళయరాజా పాటలు వేరయా.. ఆయన సంగీతంలోని గొప్పతనం గురించో, ఆయన పాటల్లోని వైవిధ్యం గురించో చెబుతున్నాం అనుకునేరు. ఆయన పాటలను తిరిగి వాడుకోవడం గురించి చెబుతున్నాం. సినిమాల్లోని ఇళయరాజా పాటల్ని మరోసారి ఎక్కడా వాడకూడదు. ఈ మేరకు ఆయన తన పాటల హక్కుల్ని అమ్మేశారు. ఎవరైనా వాడితే ఆయనకు సంబంధించిన సంస్థలకు హక్కులు చెల్లించాల్సిందే.

ఈ వ్యవహారంలో అవగాహన లేకనో, లేక అంతవరకే అవగాహన ఉండటమో కాదు కానీ.. ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ (Manjummel Boys)  టీమ్‌ ఇళయరాజా పాటను వాడుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. కోర్టు వరకు ఈ విషయం వెళ్లింది కూడా. తాజా ఈ కేసును తేల్చుకున్నారట. ఈ మేరకు ఇళయరాజాకు కొంత పెద్ద మొత్తమే చెల్లించారు అని కోడంబాక్కం వర్గాల సమాచారం. పుకార్లు నిజమైతే ‘మంజుమ్మెల్‌ బాయ్స్’ వర్సెస్‌ ఇళయరాజా ఇష్యూ తేలిపోయింది.

‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ సినిమాలో ‘గుణ’ సినిమాలోని ‘కణ్మని అన్బోదు కాదలన్’ / ‘కమ్మని ఈ ప్రేమ లేఖని’ పాటపై పాటను వాడుకున్నారు. దీంతో తాను స్వరపరిచిన పాటను అనుమతి లేకుండా వాడుకున్నందుకుగాను ఇళయరాజా సినిమా టీమ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు సౌబిన్ షాహిర్ (Soubin Shahir) , బాబు షాహిర్ , షాన్ ఆంటోనీకి ఇళయారాజా నోటీసులు పంపించారు. చట్టపరమైన హక్కులు తనకు మాత్రమే ఉన్నాయని ఇళయరాజా ఆ నోటీసులో పేర్కొన్నారు.

‘గుణ’ సినిమా నిర్మాత నుండి హక్కులు పొంది ఆ పాటను వాడుకున్నాం అని చెప్పినా.. ఆ విషయం ఒక పట్టాన తేలేలా కనిపించలేదు. మరోవైపు ఈ లీగల్ సమస్యను ఎక్కువ రోజుజలు తేలకుండా ఉంటే టెక్నికల్ సమస్యలు వస్తాయని సినిమా టీమ్‌ మధ్యవర్తిత్వానికి వచ్చారు అని సమాచారం. ఈ క్రమంలోనే ఇళయరాజా 2 కోట్లు నష్ట పరిహారం అడిగారని టాక్‌ వినిపించింది. అయితే వరుస చర్చల తర్వాత రూ. 50 లక్షలు – రూ. 75 లక్షల మధ్య బేరం తెగింది అంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus