Ileana: ఇలియానాను నెటిజన్లు అలా అవమానించారా..?

రామ్ హీరోగా నటించిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఇలియానా ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరికీ జోడీగా నటించిన ఇలియానా తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో సైతం హీరోయిన్ గా సక్సెస్ సాధించారు. బర్ఫీ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఇలియానా అక్కడ కూడా విజయాలను సొంతం చేసుకోవడంతో ఇతర ఇండస్ట్రీలకు దూరమయ్యారు. అయితే ఈ హీరోయిన్ పన్నెండేళ్ల వయస్సు నుంచి బాడీ షేమింగ్ కు గురయ్యానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతంలో బాడీ షేమింగ్ గురించి పలు సందర్భాల్లో మాట్లాడిన ఇలియానా జనాలు తన బాడీ స్ట్రక్చర్ గురించి అసభ్యకర కామెంట్లు చేశారని వెల్లడించారు. తాను సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఇలాంటి అనుభవాలను ఎక్కువగా ఎదుర్కొన్నానని ఇలియానా చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నెటిజన్లు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ గురించి కామెంట్లు చేస్తారని ఆమె వెల్లడించారు. ఈరోజు తాను ఈ స్థాయిలో ఉన్నానంటే ఎన్నో కష్టాలను అనుభవించి నేర్చుకోవడం వల్లేనని ఇలియానా చెప్పుకొచ్చారు.

తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో నెటిజన్ల నుంచి వచ్చే మెసేజ్ లలో ఎక్కువగా బాడీ షేమింగ్ కు సంబంధించినవే ఉంటాయని ఆమె అన్నారు. ప్రతి గాయం మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఇస్తుందని ఇలియానా పేర్కొన్నారు. నెటిజన్ల కామెంట్ల వల్ల కొన్నిసార్లు ఒక రకమైన భయానికి లోనవుతానని ఆమె తెలిపారు. నన్ను చూసేవాళ్లు చేసే కామెంట్ల వల్ల నాలో మానసిక సంఘర్షణ ఏర్పడుతుందని ఎన్నో అనుభవించి నేర్చుకోవడం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus