సాధారణ అమ్మాయిల నుండి హీరోయిన్ల వరకు చాలా మంది తమకు మంచి శరీర సౌష్టవం లేదని బాధపడుతుంటారు. దీన్ని బాడీ డిస్ మార్ఫిక్ డిజార్డర్ అని అంటారు. ఇలా బాధ పడిన వారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా కూడా ఉంది. తన గ్లామరస్ లుక్స్ తో, నడుము ఒంపులతో యూత్ ని ఫిదా చేసిన ఈ బ్యూటీ ఒకానొక సమయంలో అందంగా లేనని బాధపడింది. ఈ విషయాన్ని ఇలియానా స్వయంగా బయటపెట్టింది. ఐదేళ్ల క్రితం తను ఈ సమస్యతో బాధ పడినట్లు చెప్పింది.
మనం ఎంత అందంగా ఉన్నప్పటికీ.. అద్దంలో చూసుకున్నప్పుడు ఏదో లోపం కనిపిస్తుందని.. అది నిజమేనని ఇతరులు చెప్పాలని కోరుకుంటామని.. దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చింది. ఎన్నో వ్యాయామాలు, ఫుడ్ డైట్ లు చేస్తుంటామని.. కానీ జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించినప్పుడు.. మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అందంగా కనిపిస్తామనే విషయాన్ని అందరూ మర్చిపోతున్నారని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు తన శరీరాన్ని చూసి బాధపడిన ఇలియానా.. ఇప్పుడు తన బాడీలో పాజిటివ్ అంశాల్ని చూస్తున్నానని తెలిపినది.

తనలా ప్రతీ అమ్మాయి ఆలోచిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని.. బాడీ షేమింగ్ అనే సమస్యే ఉండదని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. మొదట్లో అక్కడ అవకాశాలు వచ్చినప్పటికీ ఎక్కువరోజులు హీరోయిన్ గా రాణించలేకపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి అవకాశాలు లేవు. టాలీవుడ్ లో మళ్లీ నటించాలని ప్రయత్నిస్తోంది.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
