Ileana, Pooja Hegde: డబ్బు కోసం ఆ పని చేస్తే తప్పేంటి.. పూజ పై ఇలియానా?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని హీరోయిన్గా అన్ని భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో పూజా హెగ్డే ఒకరు. అయితే ప్రస్తుతం ఈమెకు ఎలాంటి సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి పూజా హెగ్డే సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలకు వెండితెరపై అవకాశాలు లేకపోతే వారికి వెబ్ సిరీస్ లో మరొక ఆప్షన్ గా మారిపోయాయి..

ఇలా ఎంతోమంది వెబ్ సిరీస్లలో నటిస్తూ తిరిగి సినిమా అవకాశాలను అందుకొని కెరియర్ పరంగా బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ఇలాంటి వెబ్ సిరీస్లలో ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఇలియానా స్నేహితులు పూజా హెగ్డేకి ఒక వెబ్ సిరీస్ స్టోరీ వినిపించారట. ఈ విధంగా ఆయన ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పడంతో పూజ హెగ్డే తాను ఈ వెబ్ సిరీస్ లో నటించనని తేల్చి చెప్పారని,

అయినా ఆ డైరెక్టర్ తన స్నేహితురాలు అయినటువంటి (Ileana) ఇలియానా చేత ఈమెతో ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఆ డైరెక్టర్ బలవంతం పెట్టడంతో ఇలియానా కూడా పూజ హెగ్డే కు ఈ వెబ్ సిరీస్ లో చేయమని సలహా ఇచ్చిందట. ఇక ఈ వెబ్ సిరీస్ లో ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు ఉండడంతో పూజ హెగ్డే చేయనని తెలిపారు.

అయితే మనకు సినిమా అవకాశాలు లేనప్పుడు డబ్బు అవసరం ఉన్నప్పుడు ఇలాంటి వెబ్ సిరీస్లలో నటిస్తే తప్పేంటి డబ్బుకు డబ్బు వస్తుంది పేరు కూడా వస్తుంది అంటూ ఇలియానా తనకు సలహా ఇచ్చినప్పటికీ ఈమె మాత్రం ఇప్పుడు ఇలాంటి పాత్రలలో నటిస్తే సినిమాలలో కూడా తనకు అలాంటి పాత్రలలోనే అవకాశాలు వస్తాయి అంటూ ఈ వెబ్ సిరీస్ రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus