Ileana: ఇలియానా కంటే ముందే.. పూరి ఆ ఇద్దరి బాలీవుడ్ భామలను అనుకున్నాడట..!

ఏప్రిల్ 28(నిన్నటికి) కి ‘పోకిరి’ చిత్రం వచ్చి 14 ఏళ్ళు పూర్తయిన నేపధ్యంలో మహేష్ అభిమానులు ఇండియా వైడ్ ట్రెండ్ చేసారు. మహేష్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ఇది. పూరిజగన్నాథ్ … మహేష్ ను సరికొత్తగా చూపించిన తీరుకి ఆడియన్స్ రిపీటెడ్ ఈ చిత్రాన్ని చూసారు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ ఈ చిత్రం తర్వాత కమర్షియల్ గానూ ఎదిగాడు. అయితే ఈ చిత్రం మొదట ‘ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్య నారాయణ’ పేరుతో మొదట రవితేజ తో తియ్యాలి అనుకున్నాడట పూరి.

‘నాగబాబు’ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ మొదలు కావాల్సి ఉంది. మహేష్ కంటే ముందుగా పవన్, రవితేజ లను హీరోగా పెట్టుకోవాలి అని పూరి భావించాడు.అంతే కాదు హీరోయిన్ల విషయంలో కూడా ఇలియానా కంటే ముందు ఇద్దరు బాలీవుడ్ భామలను అనుకున్నాడట. వివరాల్లోకి వెళితే… నిన్న ఇండియా వైడ్ ‘పోకిరి’ తెగ ట్రెండ్ అయ్యింది. దీంతో ఓ హీరోయిన్ ఈ సినిమాని ఎందుకు రిజెక్ట్ చేసానా అని తెగ బాద పడుతూ తన స్నేహితుల దగ్గర తన ఆవేదన వ్యక్తం చేసిందట.

ఈ సినిమా నేను చేసి ఉంటే… టాలీవుడ్ లో కూడా నేను టాప్ ప్లేస్ లో ఉండేదాన్ని అని బాధపడిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు కంగనా రనౌత్. ‘పోకిరి’ సినిమాలో హీరోయిన్ గా మొదట కంగనా నే అనుకున్నాడట పూరి. ఆ సమయంలో ఆమె ‘గ్యాంగ్ స్టర్స్’ అనే చిత్రంతో బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయిందట. ఆ తరువాత ‘సూపర్’ భామ అయేషా టాకియా ను కూడా పూరి సంప్రదించాడట. ఆమె కూడా రిజెక్ట్ చేసిందట. తరువాతే ఇలియానా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus