Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 4, 2026 / 06:55 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • దుల్కర్ సల్మాన్ (Hero)
  • కయాడు లోహర్ (Heroine)
  • ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, మిస్కిన్, జయసుధ, శ్యామ్ ప్రసాద్, వినయ్ ఫోర్ట్ తదితరులు (Cast)
  • నహస్ హిదాయత్ (Director)
  • దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ (Producer)
  • జేక్స్ బిజోయ్ (Music)
  • జింషి ఖలీద్ (Cinematography)
  • చమన్ చాకో (Editor)
  • Release Date : 4th జూన్ 2026
  • వేఫారర్ ఫిలిమ్స్ (Banner)

దుల్కర్ సల్మాన్.. తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలో అతను చేసే ప్రతి సినిమా తెలుగులోకి కూడా డబ్ అవుతుంటుంది. అందులో చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఓ పక్క తెలుగులో స్ట్రైట్ సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క మలయాళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు దుల్కర్. అలా అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మలయాళం మూవీ ‘ఐ యామ్ గేమ్’.. (I’M Game) అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఇదొక ఫాంటసీ మూవీ. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఐ యామ్ గేమ్’ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :

I’M Game Movie Review

I'M Game Movie Review And Rating

కథ: డాన్ జాన్ (దుల్కర్ సల్మాన్) ఒక పెద్ద బిజినెస్మెన్ అయిన జాన్ (శ్యామ్ ప్రసాద్) కొడుకు. ఒక స్టార్టప్ కంపెనీ పెట్టినప్పటికీ, గ్యాంబ్లింగ్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ అతనికి ఎక్కువ. అప్పులు చేసి మరీ పేకాట లాంటి వాటికి డబ్బు తగలేస్తుంటాడు. ఈ క్రమంలో బలరాజ్ భాయ్ (కాలకేయ ప్రభాకర్) వద్ద కోటిన్నర వరకు అప్పు తీసుకుని, ఆ డబ్బును పేకాట, బెట్టింగ్‌లలో పోగొడతాడు.చెప్పిన సమయానికి డబ్బు తిరిగి ఇవ్వలేదని గ్రహించిన బలరాజ్.. డాన్ జాన్‌కు ఫోన్ చేస్తాడు. కానీ, డాన్ అతని ఫోన్లు లిఫ్ట్ చేయడు.

దీంతో ఆఫీస్‌కు వెళ్లి మరీ డాన్ జాన్‌ను చితక్కొడతాడు బలరాజ్ భాయ్. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు డాన్‌ను తిట్టిపోస్తారు. అయినప్పటికీ డాన్ జాన్ మారడు. దీంతో అతని తల్లి మెర్సీ (జయసుధ).. తాను దాచుకున్న రూ. 60 లక్షలు డ్రా చేసి డాన్ జాన్‌కు ఇస్తుంది. ‘ఆ డబ్బుతో బాగుపడతావో, నాశనమైపోతావో నీ ఇష్టం’ అని తెగేసి చెబుతుంది. డాన్ ఆ డబ్బును తీసుకెళ్లి క్రికెట్ బెట్టింగ్‌లో పెడతాడు. అక్కడ కూడా ఆ డబ్బంతా పోతుంది. దీంతో ఫ్రస్ట్రేట్ అయిన డాన్ జాన్..తన డబ్బు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. ప్రమాదంలో అతని కుడి చేయి బాగా డ్యామేజ్ కావడంతో, డాక్టర్లు ఆ చేతిని తొలగించి వేరే వ్యక్తి చేతిని డాన్ జాన్‌కు అమర్చుతారు.

ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు డాన్ జాన్ చేయి బాగానే పనిచేస్తుంది. కానీ, ఇంటికి వెళ్లిన తర్వాత ఆ కుడి చేయి అతన్ని చిత్రహింసలకు గురిచేయడం మొదలుపెడుతుంది. అంతేకాదు, ఆ కుడిచేయి వల్ల డేవిడ్ (మిస్కిన్) అనే మాఫియా డాన్.. డాన్ జాన్‌ను టార్గెట్ చేస్తాడు. ఒక దశలో అతని ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తాడు. డేవిడ్ బారి నుండి డాన్ జాన్ ఎలా బయటపడ్డాడు? అసలు డాన్ జాన్‌కు అమర్చిన కుడి చేయి ఎవరిది? మధ్యలో క్రికెటర్ విగ్నేష్ (ఆంటోనీ వర్గీస్) ఎవరు? అనేది మిగిలిన కథ.

I'M Game Movie Review And Rating

నటీనటుల పనితీరు: దుల్కర్ సల్మాన్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంది? ఎటువంటి పాత్రలోనైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసేస్తాడు. కాకపోతే అతను ఎక్కువగా దొంగ లేదా కల్ప్రిట్ తరహా పాత్రలనే రెగ్యులర్‌గా చేస్తుండటం ఓ సెక్షన్ ఆడియన్స్‌కి బోర్ కొట్టిస్తోంది. ఈ విషయాన్ని దుల్కర్ కూడా గ్రహించాలి. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ వద్ద దుల్కర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ సీన్‌లో వేరే నటీనటులు ఎవ్వరూ ఉండరు. ఈ సినిమా హైలైట్స్‌లో ఇదొకటని చెప్పాలి.ఇక కయాడు లోహర్ దుల్కర్‌కి జోడీగా నటించింది.

అయితే ఈమె పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఏమీ లేకపోవడం నిరాశపరిచే అంశం. సంయుక్త విశ్వనాథన్ ఓ ముఖ్యమైన పాత్ర చేసింది. తన వరకు చాలా బాగా నటించింది. ఆంటోనీ వర్గీస్ పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుంది. అతను కూడా బాగా పెర్ఫార్మ్ చేశాడు. మిస్కిన్ విలనిజం ఓకే. జయసుధ, శ్యామ్ ప్రసాద్ పాత్రలకి సరైన కన్‌క్లూజన్ లేదు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.

I'M Game Movie Review And Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘ఐ యామ్ గేమ్’ పోస్టర్స్ చూస్తే ఇదొక గ్యాంగ్‌స్టర్ మూవీ ఏమో అనిపిస్తుంది. కానీ ఫాంటసీ మూవీ అంటూ ప్రచారం చేశారు. ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ చేసిన పెద్ద మిస్టేక్ ఇదే. ఆ విషయాన్ని పక్కనపెడితే.. ఆ ఫాంటసీ ఎలిమెంట్ కూడా లారెన్స్ ‘ముని’ సిరీస్‌ల స్టైల్లో ఉంటుంది. ఇది ఇంకో మైనస్. ‘ముని’ సినిమాల్లో హీరోని ఓ ఆత్మ ఆవహించడం, కాసేపు హీరో పక్కన ఉన్నవాళ్ళని భయపెట్టడం, ఇంటర్వల్ కి మర్డర్లు చేయడం వంటివి ఉంటాయి.

సెకండాఫ్‌లో ఆ ఆత్మకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తారు. క్లైమాక్స్‌లో ఆ ఆత్మకు హీరో సాయం చేస్తాడు. తర్వాత ఆ ఆత్మ విలన్‌పై పగ తీర్చుకుంటుంది. సరిగ్గా ‘ఐ యామ్ గేమ్’ అదే టెంప్లేట్లో తీసిన సినిమా..! కాకపోతే ఇక్కడ ఆత్మ బదులు హీరో కుడిచేయి డిసార్డర్ కనిపిస్తుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. మరో విధంగా చూసుకుంటే.. ‘సవ్యసాచి’, ‘సింబా’ (సంపత్ నంది నిర్మించిన సినిమా) సినిమాల పోలికలు కూడా కొంచెం కనిపిస్తాయి.

ఏదేమైనా ఫస్ట్ హాఫ్ వరకు ‘ఐ యామ్ గేమ్’ బాగుందనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌కి వచ్చేసరికి రెగ్యులర్ ఫాంటసీ, రివేంజ్ ఎలిమెంట్స్ పెట్టి సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. దర్శకుడు సెకండాఫ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద వహించి ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది.టెక్నికల్‌గా మాత్రం సినిమా రిచ్‌గానే కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొంచెం రొటీన్‌గా అనిపించినా.. క్వాలిటీగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్‌కి వంక పెట్టాల్సిన పనిలేదు. యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ ఎపిసోడ్స్ బాగా తీశారు. రన్ టైమ్ కూడా దాదాపు 3 గంటలు ఉంది. సెకండాఫ్లో కొంత పోర్షన్ ట్రిమ్ చేయాల్సింది. కానీ ఎడిటర్ ఆ స్టెప్ తీసుకోలేదు.

I'M Game Movie Review And Rating

విశ్లేషణ: ‘ఐ యామ్ గేమ్’ ఫాంటసీ మూవీగా మొదలైన విధానం బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది కూడా..! కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి ట్రాక్ తప్పింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా మిస్ అయ్యాయి.

I'M Game Movie Review And Rating

ఫోకస్ పాయింట్: బోరింగ్ గేమ్

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #I'M Game Movie
  • #Kayadu Lohar
  • #Samyuktha Viswanathan

Reviews

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

20 mins ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

24 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version