ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడు. ఇతన్ని చాలా మంది హీరోలు అనేక విషయాలలో పొగుడుతూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం… సినిమాల్లో ఎన్టీఆర్ ఆల్ రౌండర్ ప్రతిభ చూపించడమే. డైలాగ్ లు చెప్పడం దగ్గర్నుండీ డ్యాన్స్ లు , ఫైట్ లు ఇలా ఎమోషనల్ సీన్స్, కామెడీ ఇలా ఏదైనా సరే చించి ఆరేస్తుంటాడు. అందుకే గతంలో ఓసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలు … ‘ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్.. అతని లా మేము డ్యాన్స్ చెయ్యలేము’ అని చెప్పారు.ఇలా చాలా మంది హీరోలు ఎన్టీఆర్ ను ప్రసంసిస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ మొదటి సినిమా ఏంటి.. అంటే అందరూ.. ‘నిన్ను చూడాలని’ లేదా ‘బాల రామాయణం’ అని చెబుతారు. నిజానికి ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రం ముందు మొదలు పెట్టారు కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది… దాంతో ‘నిన్ను చూడాలని’ సినిమా మొదట విడుదల అయ్యింది అని చెబుతుంటారు. అది కూడా కరెక్టే… కానీ ఎన్టీఆర్ ఇద్దరు స్టార్ హీరోలతో నటించిన సినిమా ఒకటి ఉంది. ఇప్పటికీ అది విడుదల కాలేదు.వివరాల్లోకి వెళితే… జూనియర్ ఎన్టీఆర్.. మొదటిసారి మొఖానికి రంగేసుకుంది… సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్లో తెరకెక్కిన హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ చిత్రంతో…!
ఈ సినిమాలో తారక్.. భరతుడి పాత్ర చేశాడు.తెలుగు వర్షన్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ సినిమాలో ఎన్టీఆర్ హరిశ్చంద్రుడు, బాలకృష్ణ దుశ్శంతుడు పాత్రలు వేశారు. హిందీలో కూడా అవే పాత్రలు చేసారు. అయితే హిందీ వెర్షన్‌లో దుశ్శంతుడు కొడుకైనా భరతుడి పాత్రలో మన చిన రామయ్య చేసాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా టైములో ఎన్టీఆర్ హిందీ బాగా మాట్లాడటం చూసిన సీనియర్ ఎన్టీఆర్.. ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ హిందీ వెర్షన్ కు తీసుకున్నారు. అనూహ్యంగా తెలుగులో ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో హిందీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ చిత్రాన్ని పెద్ద ఎన్టీఆర్ విడుదల చెయ్యలేదు.ఇక ఆ తర్వాత పెద్దాయన రాజకీయాల్లో బిజీ కారణంగా అయిపోవడంతో ఆ సినిమా అడ్రెస్ లేకుండా పోయింది. అలా ఇద్దరు స్టార్ లతో జూనియర్ నటించిన మొదటి సినిమా విడుదల కాకపోవడం గమనార్హం.