Inaya Sultan: ఆర్జీవీ వీడియోలపై ఇనయా ఏం చెప్పిందంటే..?

ఇనయా.. బిగ్‌బాస్‌ను ఫాలో అయ్యే వారికి ఈ పేరు పెద్ద కొత్తేమీ కాదు. తొలి ఎపిసోడ్‌ నుండి తనను తాను స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా, అలాగే ఎలాంటి సపోర్టు లేని కంటెస్టెంట్‌ చెప్పేయొచ్చు. ఏదైనా టాపిక్‌ విషయంలో ఆమె డిస్కషన్‌ చాలా చిరాకుగా ఉండొచ్చు. అయితే ఆమె ఇప్పుడు టీవీ ప్రేక్షకులకు తెలుసు కానీ, అంతకుముందే సోషల్‌ మీడియాలో అందరికీ బాగా పరిచయం. దానికి కారణం ఆమె ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో వేసిన డ్యాన్సే.

ఓ పార్టీలో వర్మతో ఇనయా వేసిన డ్యాన్స్‌లు బాగా వైరల్‌ అయ్యాయి. ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేసే అమ్మాయిలు వరుసగా పాపులర్‌ అవుతూ ఉంటారు. అలా అరియానా, అషు రెడ్డి.. తర్వాత ఇనయా పేరు చెప్పొచ్చు. ఓ సినిమా కోసం వర్మను ఇంటర్వ్యూ చేసిన ఇనయా.. ఆ తర్వాత తన పుట్టిన రోజు పార్టీకి వర్మను పిలిచింది. ఆ పార్టీలో కాస్త వర్మ ఊగుతూ, తూలుతూ ఇనయాతో డ్యాన్స్‌ చేశాడు. ఆ హాట్‌ డ్యాన్స్‌ వీడియోను సోషల్‌ మీడియాలో ఎవరో పోస్ట్‌ చేస్తే.. రాత్రికి రాత్రి వైరల్‌ అయిపోయాయి.

ఈ వీడియో వల్ల ప్రేక్షకులు నయనానందం అయితే.. ఆమెకు మాత్రం నరకం కనిపించింది. తాజాగా ఆ వీడియోల గురించి ఇనయా బిగ్‌బాస్ హౌస్‌లోనే మాట్లాడింది. ఆ వీడియోలు చూసి ఆర్జీవీతో ఇనయాకి ఏదో రిలేషన్ ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇనయా తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘‘ఆర్జీవీ అంటే నాకు ఇష్టం. ఆయన గ్రేట్ డైరెక్టర్ అనే రెస్పెక్ట్ నాకుంది. సెకండ్ లాక్ డౌన్‌ టైమ్‌లో ఒక షూట్‌లో ఆయన్ని కలిశాను. ఆ తరువాత రెండు, మూడు సందర్భాల్లో కలిశాను’’ అని చెప్పింది ఇనయా.

‘‘ఆ సమయంలో నా బర్త్ డే వచ్చింది. దానికి వర్మను పిలిచాను, ఆయన వచ్చాక కేక్ కట్ చేశాం, ఆ వెంటనే పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారంతా. అక్కడ సాంగ్స్ ప్లే చేస్తే.. అందరూ డ్యాన్స్‌ చేశారు. అందులో భాగంగా మేమూ డాన్స్ చేశాం. అయితే ఆ వీడియో వైరల్ అయిపోయింది. నా లైఫ్‌లో నా బర్త్ డేను అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నది అప్పుడే. అయితే ఆ డ్యాన్స్‌ వీడియో ఎవరు తీశారు? ఎలా బయటకు వచ్చిందో నాకు తెలియదు’’ అని క్లారిటీ ఇచ్చింది ఇనయా.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus