Inaya Sultana: ఇనయా కెప్టెన్ అయినందుకు బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్ కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. దీనికోసం హౌస్ మేట్స్ అందరూ కూడా పోటీ పడ్డారు. ఒక బాల్ ని రింగ్ లో పెట్టి ఆ బాల్ కోసం పోటీపడమని టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. అంతేకాదు, ఇదే ఆఖరి కెప్టెన్సీ అని కూడా చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ బాల్ కోసం పోటీపడ్డారు. ఇక్కడే రేవంత్ కి ఇంకా శ్రీహాన్ కి గట్టి ఫైట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. హౌస్ లో రేవంత్ మదర్ వచ్చి వెళ్లిన తర్వాత ఫ్యామిలీ ఎపిసోడ్ ముగిసింది.

ఆ తర్వాతే బిగ్ బాస్ అందరికీ ఈ టాస్క్ పెట్టాడు. అయితే, ఈ టాస్క్ లో గెలిచి చివరి కెప్టెన్ గా ఇనాయా సుల్తానా నిలిచినట్లుగా తెలుస్తోంది. అయితే, బాల్ టాస్క్ లో గెలిచిందా.. లేక హౌస్ మేట్స్ మెజారిటీ ఓటింగ్ తో గెలిచిందా అనేది తెలియాల్సి ఉంది. ఇంకో మేటర్ ఏంటంటే., బిగ్ బాస్ హౌస్ లో చివరిసారి కెప్టెన్ అయితే నేరుగా సెమీ ఫైనల్స్ కి వెళ్తారని బిగ్ బాస్ ముందుగానే చెప్పాడు. కాబట్టి, ఇప్పుడు ఈ టాస్క్ లో గెలిచి ఇనయా సుల్తానా నేరుగా సెమీస్ కి వెళ్లింది.

అంటే టాప్ 6కి అర్హత సాధించిందన్నమాట. ఫైనల్ వారానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటికే హౌస్ లో 9మంది ఉన్నారు. వీళ్లలో నలుగురు ఎలిమినేట్ అవ్వాలి అంటే మరో మూడు వారాల పాటు గేమ్ ఆడాలి. అలా కాకుండా మెగా ఫైనల్స్ కి సిద్ధం అవ్వాలంటే ఈ మూడు వారాలు ఎలిమినేషన్ కి దూరంగా ఉండాలి. ఒక్కవారం నామినేట్ అయినా కూడా ఫేట్ మారిపోతుంది. అందుకే, ఇప్పుడు ఈ టాస్క్ హౌస్ మేట్స్ కి చాలా అవసరం. ఇది తెలిసీ అందరూ బాల్ కోసం గట్టిగా ప్రయత్నించారు.

టాస్క్ లో ఫిజికల్ అవుతున్నా, దెబ్బలు తగులుతున్నా లెక్క చేయకుండా ఆడారు. ఈ టాస్క్ లో చివరకి ఇనాయా సుల్తానా కెప్టెన్ అయినట్లుగా తెలుస్తోంది. నిజానికి వాళ్ల మదర్ హౌస్ లోకి వచ్చినపుడు ఒక్కసారి అయినా కెప్టెన్ అవ్వు అంటూ అడిగింది. దీనికి ఇనాయా సుల్తానా ఛాన్స్ వస్తే అవుతానని మాట ఇచ్చింది. అనుకున్నట్లుగానే ఈవారం కెప్టెన్ అయ్యింది. దీంతో నెక్ట్స్ వీక్ ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ వచ్చేసింది.

ఇంకో వారం అదనంగా బిగ్బాస్ ఇప్పుడు ఇమ్యూనిటీ ఇచ్చాడు. సో, నేరుగా మెగా ఫినాలేకి ఒక్కవారం దూరంలోకి వచ్చింది. దీనినే సెమీఫైనల్ గా డిక్లేర్ చేశాడు బిగ్ బాస్. ఇనాయాకి అనుకోకుండా ఈ రెండు ఆఫర్లు రావడం అనేది లక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఇనయా సుల్తానా ఓటింగ్ లో దూసుకుపోతోంది. అన్ అఫీషియల్ సైట్స్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఇప్పుడు రెండు వారాలు నామినేషన్స్ లో లేకపోతే మరి ఆడియన్స్ ఇనయాని ఫినాలేకి ఎలా రిసీవ్ చేస్కుంటారు అనేది చూడాలి. మొత్తానికి అదీమేటర్.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus