Inaya, Surya: ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య..ల కలయిక.. వైరల్ అవుతున్న రొమాంటిక్ ఫోటోలు

మొదటి వారమే ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్న ఇనయ సుల్తానా 14 వారాల పాటు హౌస్ లో కొనసాగింది. అందుకు మరో కంటెస్టెంట్ ఆర్జే సూర్య అలియాస్ టీవీ9 కొండబాబు మోరల్ సపోర్ట్ కూడా ఉందన్నది బిగ్ బాస్ వీక్షకుల అభిప్రాయం. హౌస్ లో వీళ్ళు అనేకసార్లు హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. ఇనయ అప్సెట్ అయిన ప్రతీసారి సూర్య.. వెళ్లి హగ్గులు ముద్దులు ఇస్తే ఆమె సెట్ రైట్ అయిపోయేది. కిస్సులకి, హగ్గులకి బిగ్ బాస్ హౌస్ పెట్టింది పేరు.

ఈ విషయాలతో తిట్టుకుంటూనే ప్రేక్షకులు ఈ షోని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. గడిచిన 5 సీజన్లలో హౌస్ లోకి వెళ్లిన చాలా మంది కంటెస్టెంట్స్ లో కొంతమంది అమ్మాయిలు- అబ్బాయిలు.. లవర్స్ గా తిరిగొచ్చారు. ‘రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అఖిల్-మోనాల్ ఇలా కొంతమంది లవర్స్ గా బయటకు వచ్చారు. ఈ లిస్ట్ లో సూర్య- ఇనయ కూడా చేరినట్టు స్పష్టమవుతుంది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఇనయ తన ప్రియుడు సూర్యని కలిసింది.

అంతేకాదు టైట్ హగ్గు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటో పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలా వచ్చావో లేదో వెంటనే మొదలెట్టేశావ్. కనీసం ఆగలేకపోయావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే సూర్య- ఇనయ మాత్రం మేము ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ ఫోటోలు అయితే వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus