బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ ఫన్నీగా సాగాయి. ముఖ్యంగా ఆదిరెడ్డి ఇంకా ఇనయల మద్యలో కామెడీ హైలెట్ అయ్యింది. ఫస్ట్ ఆదిరెడ్డి ఇనయని నామినేట్ చేస్తూ, నువ్వు పేక్, ఫేకస్య, ఫేకోభ్యహ అంటూ మొదలుపెట్టాడు. సూర్యని నామినేట్ చేశావ్, మళ్లీ సూర్య వెళ్లిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చావ్ అంటూ పాయింట్ మాట్లాడింది. నువ్వు విన్నర్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చూసుకుంటూ గేమ్ ని అలా ప్రొజక్ట్ చేస్కోవాలని అనుకుంటున్నావని వాటిని తెచ్చిపెట్టుకుని మరీ ఆడుతున్నావని అభిప్రాయపడ్డాడు. దీంతో ఇనయ నా గేమ్ నాఇష్టం అని, విన్నర్ క్వాలిటీ కాదు, ఐయామ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 6 అంటూ రెచ్చిపోయింది.
దీంతో కామెడీ ఆపు అని, చంకలు గుద్దుకోవద్దని ఆదిరెడ్డి ఇనయకి ఉపదేశం చేశాడు. అసలు సూర్యని ఎందుకు నామినేట్ చేసావ్, వెళ్లిపోతుంటే ఎందుకు ఏడ్చావ్ అని సూటిగా అడిగాడు. సూర్యని నామినేట్ చేస్తానని నేను ఎప్పుడూ చెప్తునే ఉన్నానని, లాస్ట్ వీక్ తను కెప్టెన్ కాబట్టి చేయలేకపోయానని, తర్వతా ఇప్పుడు ఛాన్స్ దొరికింది కాబట్టి చేశానని చెప్పింది. దీనికి ఆదిరెడ్డి పాయింట్స్ మాట్లాడాడు. నువ్వు ఎక్కడ ఏది చేస్తావ్ అని అనుకుంటారో దానికి రివర్స్ చేస్తూ కావాలనే ఇలా చేస్తున్నావని చెప్పాడు. సూర్యకి కత్తిపోటు గుచ్చుతావ్ అని అనుకున్న టైమ్ లో శ్రీహాన్ కి గుచ్చుతావ్ అని,
వీళ్లకి సపోర్ట్ చేస్తావని అనుకున్న టైమ్ లో వేరేగా బిహేవ్ చేస్తావని, ఇలా విన్నర్ క్వాలిటీస్ ని ఇమడ్చుకుని కావాలని వాంటెడ్ గా గే్మ్ ఆడుతున్నావ్ అని , నువ్వు ఫేక్ గేమర్ ని డిక్లేర్ చేశాడు. దీనికి ఇనయ మళ్లీ ఆదిరెడ్డిని నామినేట్ చేసి రివర్స్ పంచ్ ఇచ్చేందుకు ట్రై చేసింది. ఇనయ ఆదిరెడ్డిని నామినేట్ చేసి, నేను గేమ్ అలా ఆడితే మీరు కూడా సీజన్స్ అన్నీ చూసి వచ్చి ఎక్కడ ఎలా ఆడాలో బాగా తెలుసుకుని మరీ వచ్చారు కదా అంటూ నిలదీసింది. అలాగే, చంకలు గుద్దుకుంటున్నావ్ అని ఆది పదే పదే అనేసరికి, అలా మాట్లాడద్దని హెచ్చరించింది.
ఇక సూర్య ఒక ఓటు వస్తే మరో ఓటు నేను వేస్తా అంటూ మీరు ఇద్దరూ కలిసి సేఫ్ గేమ్ ఆడారని అన్నాడు ఆదిరెడ్డి. సూర్యని నేను కావాలనే నామినేట్ చేశాను అని, బయటకి వేరేవిధంగా ప్రొజెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పింది. మరి అలాంటపుడు వేలుకి టాటూ వేస్కున్నావ్, వెళ్లేటపుడు ముద్దుపెట్టావ్ ఇవన్నీ ఏంటని అడిగాడు. దీంతో నా పర్సనల్ కూడా బయటకి కావాలనే లాగుతున్నారని, తనంటే ఇష్టం అంతేకాదు, అది వేరేవిధంగా బయటకి వెళ్లడం నాకు ఇష్టం లేదు అందుకే నేను శ్రీహాన్ ని, ఇంకా సూర్యని నామినేట్ చేశానని చెప్పింది.
ఫుల్ గా తను చేసిన పనిని కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఇద్దరి మద్యలో హీటెడ్ అండ్ ఫన్నీ ఆర్గ్యూమెంట్ జరిగింది. నిజానికి ఇనయని కావాలనే ఆదిరెడ్డి టార్గెట్ చేసి ఈ పాయింట్స్ డిస్కస్ చేశాడు. ఖచ్చితంగా ఎక్కడ పాయింట్ ఉంటుందో అక్కడ లాక్ చేశాడు. ఈవారం నామినేషన్స్ లో మొత్తం 10మంది ఉన్నారు. కెప్టెన్ శ్రీహాన్ ని ఎవరూ నామినేట్ చేయకూడదు కాబట్టి నామినేషన్స్ లో లేడు. అలాగే రాజ్ ని , ఇంకా వాసంతీనీ ఎవరూ నామినేట్ చేయలేదు. మిగతా 10మంది నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ? ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!