సూర్యతో ఫ్రెండ్షిప్, శ్రీహాన్ తో కటాఫ్..! గేమ్ స్ట్రాటజీ ఇదేనా..!

బిగ్ బాస్ హౌస్ లో ఈసీజన్ లో కొద్దిగా తన గేమ్ ని అందరికంటే విభిన్నంగా మొదలెట్టింది ఇనయ. మొదట్లో శ్రీహాన్ ఏది మాట్లాడినా విరుచుకుపడేది. అలాగే, శ్రీహాన్ కూడా ఇనయని టీజ్ చేస్తూ రెచ్చగొట్టే వాడు. ఇద్దరూ కలిసి మంచి కంటెంట్ ని క్రియేట్ చేశారు. కానీ, సడన్ గా టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ టాస్క్ అియిన తర్వాత ఇనయ శ్రీహాన్ ని బాగా మెచ్చుకుంది. దీంతో ఇద్దరూ కలిసిపోయారు. దీనికి బలమైన కారణం సూర్యనే. సూర్య చుట్టూ పొద్దు తిరుగుడు పువ్వులా తిరుగుతున్నావ్ అని హోస్ట్ నాగార్జున ఇన్ పుట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇనయ సూర్యని నామినేట్ చేసేసింది.

అంతేకాదు, శ్రీహాన్ ని సైతం నామినేట్ చేసి మా ఇద్దరి మద్యలో కూడా ఏదీ లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక వారం రోజుల గేమ్ లో మళ్లీ ఏమైందో ఏమో కానీ, సూర్యకి మెల్లగా దగ్గరయిపోతోంది. బయట సూర్యకి బుజ్జమ్మ అనే గర్ల్స్ ప్రెండ్ ఉందని తెలిసి కటాఫ్ చేసింది. కానీ, సూర్య తనకి ఇచ్చిన బ్రేస్ లెట్ రేవంత్ దగ్గర ఉండటం ఇష్టం లేదని తీస్కున్నాని చెప్పాడు సూర్య. దీంతో ఇనయ మనసు వెన్నలా కరిగిపోయింది. సూర్యకి దగ్గరయ్యింది. మళ్లీ ఇద్దరూ కలిసి ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేసేస్తున్నారు.

అంతేకాదు, తను కెప్టెన్సీ పోటీదారులుగా తను ఎంపిక అవ్వనప్పుడు సూర్యని గట్టిగా కౌగిలించుకుని మరీ ఏడ్చింది. అప్పట్నుంచీ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. నిజానికి నాగార్జున వీకండ్ షోలో హింట్ ఇచ్చినప్పటి నుంచీ ఇద్దరూ మాట్లాడుకుని గేమ్ ఆడదాం అని అనుకున్నారు. ఇక గెస్ట్ గా వచ్చిన హైపర్ ఆది టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా ఇనయది, శ్రీహాన్ ది చాలా బాగుంది. మీరు అలాగే ఉండండి అనేసరికి ఇనయ మరోసారి శ్రీహాన్ తో గొడవ పెట్టుకునేందుకు సిద్ధం అయిపోయింది. దీంతో కెప్టెన్ గా తను పోటీ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయకుండా కత్తిపోటు గుచ్చింది.

నీకు స్టబిలిటీ లేదంటూ మాట్లాడింది. దీంతో శ్రీహాన్ మరోసారి ఇనయపై కోపంతో రగిలిపోయాడు. ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తోంది అని అన్నాడు. ఇక కెప్టెన్ అయిన తర్వాత ఎవరూ కూడా అన్నం వేస్ట్ చేయద్దని రూల్ పెట్టాడు. అంతకుముందే అన్నం పక్కకి పెట్టేసిన ఇనయ తను కర్రీలేక తినలేదని క్లారిటీ ఇచ్చింది. దీంతో మరోసారి ఇద్దరి మద్యలో గొడవ ముదిరింది. వంట సెషన్ లో ఇనయని ‌వంటే చేయమని చెప్పాడు. నాకు వంట రాదని, నేను చేయలేను అని చెప్పింది. నేను ఆఖరిసారిగా వండి పెట్టినపు్వడడు మా నాన్నగారికి గుండెపోటు వచ్చిందని అందుకే వంట చేయలేనని తెగేసి చెప్పింది ఇనయ.

ఏది ఏమైనా మరోసారి ఇనయ శ్రీహాన్ తో గట్టి పోటీకి సిద్ధం అయ్యింది. శ్రీహాన్ కెప్టెన్ అవ్వడం ఇనయాకి ఇష్టం లేదు. అలాగే, సూర్యకి దగ్గరవ్వడం కూడా ఇష్టం లేదు. కానీ చేస్తోంది. కావాలనే హౌస్ లో కంటెంట్ ఇవ్వడానికి ఇనయ ఇలా చేస్తోందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఇలా గొడవలు జరిగితేనే సీజన్ సూపర్ హిట్ అవుతుందని గీతు సైతం అభిప్రాయపడింది. మొత్తానికి ఇనయ గేమ్ లో మరో షేడ్ ని ఆడియన్స్ కి చూపిస్తోందన్నమాట. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus