పన్ను ఎగవేత.. మరోసారి అగ్ర నిర్మాతలపై ఐటీ రైడ్స్..!

  • August 2, 2022 / 07:28 PM IST

ఐటీ రైడ్స్ అనేవి సినీ పరిశ్రమకు చెందిన జనాలకు కొత్తేమీ కాదు.మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు, నిర్మాతలు వంటి వారి ఇళ్లు, ఆఫీసుల పై ఇన్కమ్ టాక్స్ సభ్యులు రైడ్ చేయడం చాలా సార్లు చూశాం. గతంలో మహేష్ బాబు, హీరో నాని, సితార ఎంటర్టైన్మెంట్స్, తమిళ స్టార్ హీరో విజయ్,కె.జి.ఎఫ్ హీరో యష్ వంటి వారి పై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పుడు మరోసారి కోలీవుడ్ బడా నిర్మాతలను టార్గెట్ చేసి వారి ఇల్లు ఆఫీస్ ల పై సోదాలు నిర్వహిస్తున్నారు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు. ఇందులో భాగంగా కోలీవుడ్ బడా ప్రొడ్యూసర్ నిర్మాత కలైపులి ఎస్. థాను తో పాటు ఇంకో 10 మంది నిర్మాతలు, ఫైనాన్సియర్ల కార్యాలయాలపై మంగళవారం నాడు సోదాలు నిర్వహించింది ఇన్కమ్ టాక్స్ బృందం. ‘టాక్స్ ఎగ్గొట్టిన కారణంగా అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించామని’.

ఉదయం 5 గంటల నుండి ఈ సోదాలు ప్రారంభమయ్యాయని , సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని’ చెప్పారు. నిర్మాత కలైపులి థాను, అన్బుచెజియన్, ఎస్.ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా, మరో నలుగురు నిర్మాతల ఆఫీసులపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. నిర్మాతలపైనే కాకుండా కొంతమంది ఫైనాన్సియర్ల ఇళ్ల పై కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం. చాలా మంది నిర్మాతలకు..

ఫైనాన్షియర్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే. నిర్మాత బ్రాండ్ పై సినిమా తీసి, దానికి బిజినెస్ బాగా జరిగిన తర్వాత ఆ సినిమాకి ఫైనాన్షియర్స్ పెట్టిన బడ్జెట్ ను వడ్డీలతో సహా చెల్లిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా.. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్ అనే చర్చ కూడా మొదలైంది. మరి అది నిజమో కాదో తెలియాల్సి ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus