Indian 2: ‘భారతీయుడు 2’ వచ్చేది అప్పుడేనా? అందుకే స్టార్ట్‌ చేశారా?

‘భారతీయుడు 2’ సినిమా ఎప్పడొస్తుంది? గత కొన్ని రోజులుగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. కొన్ని నెలల క్రితమే సినిమా పూర్తయినా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయితే డేట్‌ విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. కానీ మరోవైపు సినిమా టీమ్‌ ప్రచారం షురూ చేస్తోంది అని అంటున్నారు. ఈ మాటలకు ఊతమిచ్చేలా సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. వాటి ప్రకారం చూస్తే త్వరలో డేట్‌ అనౌన్స్‌ చేస్తారు అని అంటున్నారు.

రామ్‌చరణ్‌ అభిమానులు ‘గేమ్‌ ఛేంజర్‌’ కంటే… ‘భారతీయుడు 2’ సినిమా గురించి ఎక్కువ సీరియస్‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా పనులు పూర్తయి, సినిమా విడుదల అయితే కానీ ‘గేమ్‌ ఛేంజర్‌’ పనుల మీద శంకర్‌ పూర్తి స్థాయిలో దృష్టి పెడతారు అని అనుకోవడమే దీనికి కారణం. ఇలా ఆలోచిస్తున్న వారికి గుడ్‌ న్యూస్‌ వచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే గుట్టుచప్పుడు కాకుండా ‘భారతీయుడు 2’ సినిమా ప్రమోషన్లు తమిళనాడులో భారీ ఎత్తున మొదలుపెట్టారు.

నిలువెత్తు బిల్డింగులు మీద కమల్ హాసన్ పెయింటింగులు, హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం తమిళనాడు అంతటా ఇలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయట. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ తరహా ఏర్పాట్లు ఉన్నాయంటున్నారు. అయితే గతంలోనే ‘భారతీయుడు 2’ మే నెలలో వస్తుందనే ప్రచారం ఉంది. అయితే కమల్‌ విలన్‌గా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ కూడా అప్పుడే వస్తుంది. దీంతో రెండు సినిమాల మధ్య గ్యాప్‌ ఉండేలా ‘భారతీయుడు 2’ డేట్‌ ఫిక్స్‌ చేస్తారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో మే నాలుగో వారంలో (Indian 2) ‘భారతీయుడు 2’ను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారట. సినిమా మూడో భాగం కూడా ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ప్రమోషన్లు స్టార్ట్ చేద్దామని శంకర్‌ అనుకుంటున్నారట. అందుకే హోర్డింగ్‌లు, పెయింటింగ్‌లు కనిపిస్తున్నాయి కోడంబాక్కం టాక్‌. అన్నట్లు తమిళ ఆడియో ఫంక్షన్‌లో ఏప్రిల్‌లో నిర్వహిస్తారని సమాచారం. మన దగ్గర ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే ఉంటుందట.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus