Tollywood: టాప్ ఫుట్‌ఫాల్స్ లిస్టులో మన స్టార్స్ హవా.. షాకింగ్ రిపోర్ట్!

వందల కోట్ల క్లబ్‌లు కాదు, అసలైన స్టార్‌డమ్‌ను కొలిచేది ‘ఫుట్‌ఫాల్స్’. టికెట్ రేట్లు పెంచి కలెక్షన్లు చూపించొచ్చు, కానీ మొదటి రోజు ఎంత మంది జనం థియేటర్‌కు వచ్చారన్నదే హీరో స్టామినాకు అసలు సిసలైన గీటురాయి. ఈ లెక్కల్లో ఆల్ టైమ్ రికార్డులను చూస్తే, బాలీవుడ్‌కు మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం.

Tollywood

ఈ లిస్ట్‌లో నంబర్ వన్ ఎవరో ఊహించడం కష్టమేమీ కాదు. ‘బాహుబలి 2’ సృష్టించిన సునామీ అది. మొదటి రోజే ఏకంగా 1.05 కోట్ల మంది ఈ సినిమా చూశారు. ఇది ఎప్పటికీ చెరగని రికార్డులా కనిపిస్తోంది. ఎందుకంటే, రెండో స్థానంలో ఉన్న ‘పుష్ప 2’ (71 లక్షలు), ‘KGF 2’ (70 లక్షలు) కన్నా ‘బాహుబలి 2’ ఏకంగా 30 లక్షలకు పైగా ఫుట్‌ఫాల్స్‌తో అందనంత ఎత్తులో ఉంది.

ఈ ఆల్ టైమ్ లిస్ట్‌ను ‘ఇండియన్ సినిమా’ లిస్ట్ అనడం కంటే, ‘సౌత్ సినిమా’ లిస్ట్ అనడం కరెక్ట్. టాప్ 8 స్థానాల్లో ఏకంగా 7 సినిమాలు (‘పుష్ప 2’, ‘KGF 2’, ‘RRR’, ‘సలార్’, ‘కల్కి’, ‘ఆదిపురుష్’, ‘సాహో’) సౌత్ ఇండస్ట్రీలవే కావడం విశేషం. బాలీవుడ్ నుంచి కేవలం ‘జవాన్’ (45 లక్షలు), ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ (45 లక్షలు) మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.

టాప్ లిస్ట్

బాహుబలి 2: 1.05 కోట్లు

పుష్ప 2 ది రూల్ 71: లక్షలు

KGF 2: 70 లక్షలు

RRR: 58 లక్షలు

సలార్: 52 లక్షలు

కల్కి 2898 AD: 51 లక్షలు

ఆదిపురుష్: 48 లక్షలు

సాహో: 48 లక్షలు

జవాన్: 45 లక్షలు

ప్రేమ్ రతన్ ధన్ పాయో: 45 లక్షలు

లియో: 44 లక్షలు

దేవర: 42 లక్షలు

అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ లిస్ట్‌కు అసలైన ‘కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్’ ప్రభాస్. టాప్ 12లో ఏకంగా 5 సినిమాలు ప్రభాస్‌వే ఉన్నాయి. అందులో ‘బాహుబలి 2’, ‘సలార్’, ‘కల్కి’ లాంటి హిట్లు ఉండటం గొప్ప విషయమే. కానీ, ‘ఆదిపురుష్’, ‘సాహో’ లాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా టాప్ 8 ఓపెనింగ్స్‌లో ఉన్నాయంటే, అది ప్రభాస్ స్టామినాకు నిదర్శనం. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా, కేవలం ప్రభాస్ పేరు మీదే మొదటి రోజు జనాలను థియేటర్లకు రప్పించడంలో ఆయనకు సాటిలేరని ఈ నంబర్స్ ప్రూవ్ చేస్తున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus