ఏపీ టికెట్ రేట్ల సమస్య వల్ల టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు పెద్ద సినిమాల నిర్మాతలు సైతం టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. పెద్ద సినిమాలకు ఏపీలో అమలవుతున్న టికెట్ రేట్లు వర్కౌట్ కావని కామెంట్లు వినిపించాయి. అయితే ఇండస్ట్రీ తరపున మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ ను కలిసి టికెట్ రేట్ల సమస్యతో పాటు ఇతర సమస్యలను వివరించారు. గత నెలలోనే ఈ సమావేశం జరగాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సమావేశం వాయిదా పడింది.
సీఎం జగన్ టికెట్ రేట్లను పెంచుతానని అయితే టికెట్ రేట్లను మరీ ఎక్కువగా పెంచడం మాత్రం సాధ్యం కాదని చెప్పారని సమాచారం. లేఖ రూపంలో కొత్త వినతి పత్రాన్ని పంపించాలని సీఎం జగన్ చిరంజీవికి సూచించారని తెలుస్తోంది. జగన్ సర్కార్ టికెట్ రేట్లను ఏ మేరకు పెంచుతుందో చూడాల్సి ఉంది. త్వరలోనే చిరంజీవి జగన్ కు వినతి పత్రాన్ని పంపించనున్నారు. అయితే తెలంగాణ స్థాయిలో ఏపీలో టికెట్ రేట్లు పెరిగే అవకాశం మాత్రం లేదు.
ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లపై ఇప్పటికే కమిటీని నియమించింది. కమిటీ నివేదిక తర్వాత సీఎం జగన్ ఇండస్ట్రీ ప్రముఖులతో చర్చించి టికెట్ రేట్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలో టికెట్ రేట్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సంతోషిస్తున్నారు. జగన్ తనకు సోదర సమానుడని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం. ఏపీలో టికెట్ రేట్లు పెరిగి కరోనా కేసులు తగ్గితే పెద్ద సినిమాలు రిలీజయ్యే అవకాశం ఉంటుంది.
సవరించిన జీవోలో టికెట్ రేట్లు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. రోజుకు 5 షోల విషయంలో ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వెలువడితే టాలీవుడ్ ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది. టాలీవుడ్ తరపున పెద్దమనిషి హోదాలో చిరంజీవి సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి ఏపీలో కొత్త టికెట్ రేట్లు అమలులోకి వస్తాయో లేదో చూడాల్సి ఉంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!