తమిళ చిత్ర పరిశ్రమ బాగుండాలని కోరుకోవడమే కాదు, అందుకోసం కష్టపడుతున్న తమిళ హీరోల్లో విశాల్ ఒకరు. అతను తమిళ చిత్రాలతో పాటు తెలుగు చిత్రాలు సైతం పైరసీ కాకుండా గట్టి చర్యలను చేపట్టారు. గతంలో బాహుబలి కంక్లూజన్ పైరసీ డీవీడీలు అమ్ముతున్న కొంతమందిని పోలీసులకు పట్టించి టాలీవుడ్ సినీ ప్రముఖుల నుంచి అభినందనలు అందుకున్నారు. ఇలా ఎంతమందికి జైలుకి పంపించినా, పైరసీ ని అరికట్టడానికి బృందాలు పనిచేస్తున్నా.. ఆ లీకేజీలను ఆపలేకపోతున్నాయి. విశాల్ కథానాయకుడిగా నటించి సొంతంగా నిర్మించిన తాజా చిత్రం తుప్పరివాలన్. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం విడుదలయింది. ఈ చిత్రం పైరసీకి గురి కాకుండా విశాల్ జాగ్రత్తలు తీసుకున్నా రు.
తన అభిమానులను కొన్ని బృందాలుగా విభజించి తమిళనాడు రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో నిఘాను పెట్టారు. ఎవరూ సెల్‌ఫోన్ లో చిత్రీకరించకుండా ఈ బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. విశాల్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆయనకు సవాల్ విసిరేలా తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్ తుప్పరివాలన్ చిత్రాన్ని శుక్రవారం నెట్లో ప్రసారం చేసి షాక్ ఇచ్చింది. మరికొన్ని ఇదే బాటలో నడిచాయి. వెంటనే ఆ వెబ్‌సైట్‌లపై తగిన చర్యలు చేపట్టాలంటూ విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళ్‌గన్ వెబ్‌సైట్ నిర్వాహకుడు గౌరీశంకర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇప్పుడు తమిళ్‌రాకర్స్ వెబ్‌సైట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై విశాల్ పోలీసులతో చర్చలు జరుపుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.