Acharya Movie: చిరు, కొరటాల శివ జాగ్రత్త పడాల్సిందేనా?

  • September 29, 2021 / 11:18 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలలో ఆచార్య సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు అసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఐదో సినిమా ఆచార్య కాగా చిరంజీవి, చరణ్ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటించడంతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాపై ఆసక్తి తగ్గుతోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన లాహే లాహే సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వస్తే మాత్రమే ఆచార్య ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. ఆచార్య విషయంలో చిరు, కొరటాల శివ జాగ్రత్త పడాల్సి ఉంది. సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచాల్సి ఉంది.

చిరంజీవి ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కొరటాల శివ ఆచార్య సినిమా రిలీజ్ కాకుండానే తరువాత సినిమా షూటింగ్ పనులతో బిజీ అవుతున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ త్వరలో రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆచార్య సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యం కావడంతో తర్వాత సినిమాల షూటింగ్ లను వేగంగా పూర్తి చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus