Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయిపల్లవి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో సాయిపల్లవి (Sai Pallavi) ఒకరు కాగా సాయిపల్లవి నిదానంగా సినిమాలలో నటించినా మంచి సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తున్నారు. సాయిపల్లవి పారితోషికం 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. సాయిపల్లవి డ్యాన్స్ అద్భుతంగా చేస్తారనే సంగతి తెలిసిందే. ప్రస్తుత టాలీవుడ్ హీరోయిన్లలో సాయిపల్లవి నంబర్ వన్ డ్యాన్సర్ అని చెప్పవచ్చు. సాయిపల్లవి కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ కావడానికి ఆమె ఇతర హీరోయిన్లకు భిన్నంగా కనిపించడానికి ఆమె ముఖానికి ఉన్న మొటిమలు కూడా ఒక విధంగా కారణమనే సంగతి తెలిసిందే.

అయితే మొటిమలు వచ్చిన తొలినాళ్లలో వాటిని తగ్గించుకోవడానికి సాయిపల్లవి ఎన్నో ప్రయత్నాలు చేశారట. సాయిపల్లవి ఆరు కంటే ఎక్కువ భాషల్లో అనర్ఘళంగా మాట్లాడగలరు. ఒకవైపు హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తూనే సాయిపల్లవి ఎంబీబీఎస్ ను పూర్తి చేయడం కొసమెరుపు. సాయిపల్లవి చేతిలో అప్పుడప్పుడూ జపమాల ఉంటుంది. జపమాల వల్ల మంచి జరుగుతుందని ఆమె ఫీలవుతారని తెలుస్తోంది.

సాయిపల్లవికి మెమొరీ పవర్ కూడా ఎక్కువని కఠినమైన డైలాగ్స్ ను సైతం ఆమె అలవోకగా చెప్పగలరు. సాయిపల్లవి చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండగా భవిష్యత్తు సినిమాలతో సాయిపల్లవి ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలుస్తాయో చూడాల్సి ఉంది. విభిన్నమైన ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సాయిపల్లవి ప్రతి సినిమా స్పెషల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సాయిపల్లవి కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ తన సినిమాలతో ప్రశంసలు అందుకుంటున్నారు. సాయిపల్లవి యాక్టింగ్ కు పిల్లల నుంచి పెద్దల వరకు అభిమానులు ఉన్నారు. సాయిపల్లవి సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న నేపథ్యంలో ఆమె డ్యాన్స్ కు సైతం ఎంతోమంది ఫ్యాన్స్ గా మారుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus