Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’లో శ్రీకాంత్‌ లుక్‌ వెనుక ఆసక్తికర విషయం.. ఏంటంటే?

శంకర్‌ (Shankar) సినిమాల్లో భారీతనం కనిపిస్తుంది. సినిమా కథ, తారాగణం ఎంపిక, సెట్స్‌.. ఇలా ఏది చూసినా ఆయన స్టైల్‌ రిచ్‌నెస్‌, హెవీనెస్‌ ఉంటాయి. ఈ క్రమంలో మినిమమ్‌ డిటెయిల్స్‌ కూడా ఆయన మిస్‌ కారు. అందుకు ఉదాహరణలు చెప్పాలంటే ఆయన సినిమాల్లో ఏ పాత్ర చూసినా తెలిసిపోతుంది. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’లో (Game Changer)  కూడా ఇలాంటి ఓ పాయింట్‌ చూడొచ్చు.

Game Changer

ఇప్పటికే వచ్చిన సినిమా టీజర్‌లో శ్రీకాంత్ (Srikanth)  పాత్ర ఎలా ఉంటుంది అనే విషయం చూపించారు. ఈ సినిమాలో ఆయన సీనియర్‌ రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. ఆయనను చూస్తే.. కాసేపు ఈ శ్రీకాంతేనా అనిపిస్తే.. ఆ వెంటనే భలేగా మేకప్‌ కుదిరిందే అని కూడా అనిపిస్తుంది. అయితే ఎక్కడా ఓవర్‌ చేసినట్లుగా లేకుండా.. నేచురల్‌గా కనిపించాడు శ్రీకాంత్.

అంతలా ఎలా సాధ్యమైంది అని చూస్తే.. ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదే ఆ పాత్ర లుక్‌కు స్ఫూర్తి ఆయన తండ్రేనట. శ్రీకాంత్ తండ్రి ఫొటో అంటూ ఒకటి సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. దాన్ని, ‘గేమ్‌ ఛేంజర్‌’లోని చరణ్‌ లుక్క్‌ను చూస్తే.. చాలా దగ్గరగా ఉన్నాయి. ఆ ఫొటోను రిఫరెన్స్‌గా తీసుకునే శ్రీకాంత్‌ లుక్‌ను ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా సిద్ధం చేశారట.

ఈ విషయం తెలిశాక.. శంకర్‌ పాత్రలు, దాని కోసం ఆయన పడ్డ కష్టం గురించి మరోసారి చర్చ నడుస్తోంది. శ్రీకాంత్‌కు వయసయ్యాక ఎలా ఉంటారు అనడానికి ఆయన తండ్రి ఫొటోనే వాడుకోవడం శంకర్‌ ప్లానింగ్‌కి నిదర్శనం అని అంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమా గురించి చూస్తే.. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ చేస్తున్నారు.

రామ్‌చరణ్‌ సరసన కియారా (Kiara Advani)  నటించిన ఈ సినిమా మూడో సాంగ్‌ గురువారం విడుదల కానుంది. ‘నానా హైరానా..’ అంటూ సాగే పాట టీజర్‌ ఇప్పటికే ఆకట్టుకుంటోంది. పాట కూడా అదిరిపోతుందని టీమ్‌ టాక్‌.

నాని సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus