టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోల అభిమానులు తమ ఫేవరెట్ హీరోలు ఫలానా డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని భావిస్తుంటారు. అలా అభిమానులు ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ప్రభాస్ త్రివిక్రమ్ కాంబో, బన్నీ జక్కన్న కాంబో, మహేష్ బోయపాటి కాంబో ఉన్నాయి. బన్నీ రాజమౌళి కాంబోలో సినిమా వస్తుందని పలు సందర్భాల్లో వార్తలు వైరల్ అయినా రాజమౌళి ఈ వార్తల గురించి ఎప్పుడూ స్పందించలేదు. మహేష్ సినిమా తర్వాతైనా బన్నీ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రాజమౌళి అడిగితే బన్నీ నో చెప్పే అవకాశం అయితే ఉండదు. పుష్ప సినిమాతో బన్నీకి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులోనైనా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా ఇప్పటివరకు సినిమా రాలేదు. ప్రభాస్ మాస్, యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడితే త్రివిక్రమ్ క్లాస్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తారు. ఈ కాంబినేషన్ కు సంబంధించి గతంలో వార్తలు వచ్చినా ఆ సినిమాలు సెట్స్ పైకి వెళ్లలేదు.
భవిష్యత్తులోనైనా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. మహేష్ బాబు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గతంలో ఈ కాంబినేషన్ కు సంబంధించి వార్తలు వైరల్ అయినా మహేష్ బాబు నుంచి బోయపాటి శ్రీనుకు గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను భవిష్యత్తు ప్రాజెక్టులతో కూడా విజయాలను అందుకుంటే మాత్రం మహేష్ బాబు బోయపాటి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ అయితే ఉంది.
ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్లలో ఎప్పటికైనా సినిమా వస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఈ కాంబినేషన్ లో ఎప్పుడు సినిమాలు వచ్చినా ఆయా సినిమాలపై భారీగా అంచనాలు ఏర్పడతాయనడంలో సందేహం లేదు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!