ఈతరం స్టార్ హీరోలు ఎవరనే ప్రశ్నకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లు వినిపిస్తాయి. ఈ స్టార్ హీరోలంతా దాదాపుగా ఒకే సమయంలో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. చిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా కెరీర్ ను మొదలుపెట్టగా మగధీర సినిమాతో రామ్ చరణ్ కు స్టార్ స్టేటస్ సొంతమైంది. ఈ టాలీవుడ్ స్టార్ హీరోలంతా సినిమాకు బిలో యావరేజ్ టాక్ వచ్చినా సులువుగా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సాధించేంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కావడం గమనార్హం.
చరణ్ తర్వాత నాని, విజయ్ దేవరకొండ, మరి కొందరు హీరోలు వరుస హిట్లు సాధించడంతో పాటు భారీగా కలెక్షన్లను సొంతం చేసుకున్నా స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి ఈ జాబితాలో చేరతారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. 2022 సంవత్సరం ఆగష్టు నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.
నాని సినిమాలు హిట్లు అవుతున్నా ఆ సినిమాలకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు మాత్రం రావడం లేదు. మరో టాలెంటెడ్ హీరో రామ్ తన మార్కెట్ ను పెంచుకోవడానికి వేర్వేరు ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్ భవిష్యత్తు సినిమాల బడ్జెట్లు సైతం ఊహించని స్థాయిలో పెరిగాయనే సంగతి తెలిసిందే. మరి కొందరు యంగ్ హీరోల సినిమాలు సైతం సక్సెస్ సాధిస్తున్నా ఈ హీరోల సినిమాల కలెక్షన్లు 10 కోట్ల రూపాయలకే పరిమితమవుతున్నాయి.
మెగా హీరోలలో వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్ లకు భారీస్థాయిలో మార్కెట్ ఉంది. అయితే ఈ హీరోలు వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. మిడిల్ రేంజ్ హీరోలలో చాలామంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ హీరోలలో ఎంతమందికి ఆ గుర్తింపు దక్కుతుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!