Kamal Haasan, Jackie Chan: కమల్‌ హాసన్‌ – జాకీ చాన్‌ మధ్య ఇంట్రెస్టింగ్‌ డిస్కషన్‌!

కమల్ హాసన్‌కి జాకీ చాన్‌కి కామన్‌ పాయింట్స్‌ చాలా ఉన్నాయి. వారి దేశాలు వేరు, భాషలు వేరు కానీ ఓ విషయంలో మాత్రం ఇద్దరూ ఒకటే. అంతేకాదు మరో విషయంలో జాకీ చాన్‌ కంటే కమల్‌ హాసనే ముందున్నారట. ఈ విషయాన్ని కమల్‌ హాసనే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందులోనే తన ఎముకలు విరగడం వెనుక ఉన్న ఫన్నీ స్టోరీ ఒకటి బయటకు వచ్చింది. అంతేకాదు ఎవరెవరికి ఎన్ని బోన్స్‌ బ్రేక్‌ అయ్యాయి అనేది కూడా బయటకు వచ్చింది.

బాలీవుడ్‌ టీవీ కార్యక్రమం కపిల్‌ శర్మ షోలో కమల్‌ ఇటీవల పాల్గొన్నారు. ఈ క్రమంలో తన కెరీర్‌ గురించి కీలక విషయాలు చెప్పారు. అందులో భాగంగానే ఈ బోన్‌ బ్రేకింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఇదే షోకి కొన్ని రోజుల క్రితం ‘కుంగ్‌ ఫు యోగా’ సినిమా ప్రచారం కోసం వచ్చారు జాకీ చాన్‌. అప్పుడు తన బాడీలో బోన్‌బ్రేక్స్‌ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఫన్నీగా చెప్పుకొచ్చారు. తల నుండి పాదాల వరకు చాలా చోట్ల ఎముకలు విరిగాయి అని చెప్పాడు జాకీ చాన్‌.

ఆ వీడియోను చూపిస్తూ, మీరు కూడా ఇలానే చాలాసార్లు బోన్స్‌ విరగొట్టుకున్నారు కదా అని కమల్‌ని అడిగితే.. గతంలో జాకీ చాన్‌కు, తనకు మధ్య ఇదే చర్చ జరిగిందని చెప్పాడు కమల్‌. జాకీ చాన్‌ చెన్నైకి వచ్చినప్పుడు కలిశానని, అప్పుడు మీరు యాక్షన్‌ సినిమాలు చేస్తుంటారు ఎన్ని బోన్స్‌ విరిగాయి అని జాకీ చాన్‌ని కమల్‌ అడిగారట. దానికి ఆయన 36 అని చెప్పారట. ఓహో అవునా.. అయితే మీరు నా దగ్గరకు వచ్చేస్తున్నారు.

నాకు 50 బోన్స్‌ విరిగాయి అని చెప్పారట కమల్‌. రియల్‌ స్టంట్‌లు, యాక్షన్‌ సీన్స్‌ అంటే జాకీ చాన్‌కానీ, కమల్‌ కానీ ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. అందుకే అన్నేసి బోన్‌ బ్రేక్స్‌ ఉన్నాయి. వీరిని ఆదర్శంగా తీసుకొనే నేటితరం హీరోలు యాక్షన్‌ సీన్స్‌ రియల్‌గా చేస్తున్నారు. అందుకే కమల్‌ ఎప్పటికీ యువతకు ఇన్‌స్పిరేషనే. ఏమంటారు?

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus