Bigg Boss 6: కామన్ మ్యాన్ ఆదిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?

బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం అన్ని భాషల్లోనూ సీజన్లను పూర్తిచేసుకుని ప్రసారమవుతుంది. కార్యక్రమం తెలుగులో కూడా ఇప్పటికి ఐదు సీజన్లను పూర్తి చేసుకుని ఆరో సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది. తెలుగులో ఈ కార్యక్రమం అయిదు సీజన్లతో పాటు ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. ఇక సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ఈ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రసారం కానుంది.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నబోయే కంటెస్టెంట్లను క్వారంటైన్ పంపించారు.ఇకపోతే ఈసారి ఈ సీజన్లో ఒక కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది.అయితే ఆ కామన్ మ్యాన్ ఎవరు ఏంటి అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ కార్యక్రమంలోకి కామన్ మ్యాన్ గా ఆదిరెడ్డి వెళ్లనున్నట్లు సమాచారం.

అసలు ఈ ఆదిరెడ్డి ఎవరు? అతను ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయానికి వస్తే… ఆదిరెడ్డి నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వరికుంటపాడు గ్రామానికి చెందిన వ్యక్తి. వీరిది వ్యవసాయ కుటుంబం ఈయన తన అక్క అన్నయ్యలతో కలిసి ఉంటారు.నెల్లూరులో డిగ్రీ వరకు పూర్తిచేసి చదువు ఆపేసిన ఆదిరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ తో తన ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అదే సమయంలోనే తన తల్లి మరణించడంతో రెండు సంవత్సరాలు పాటు ఇంటిలో ఉన్న అనంతరం ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లారు.

ఇలా ఈయన బెంగళూరులో ఉద్యోగం కోసం వెళ్లిన సమయంలో బిగ్ బాస్ సీజన్ 2 గురించి విశ్లేషిస్తూ ఒక వీడియో చేశారు.ఇక ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో అప్పటినుంచి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ గురించి విశ్లేషణ చేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఈయన ఎంతో ఫేమస్ అయ్యారు. అయితే ఈయనని సెలబ్రెటీ క్యాటగిరీ కింద కాకుండా కామన్ మ్యాన్ ఎంట్రీ గా బిగ్ బాస్ కార్యక్రమంలోకి తీసుకొస్తున్నారు. ఇలా బిగ్ బాస్ గురించి విశ్లేషణ ఇస్తున్నటువంటి ఆదిరెడ్డినీ ఏకంగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి తీసుకువస్తున్నారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus