Hombale: హోంబలే బ్యానర్ పేరు వెనుక సీక్రెట్ ఇదే.. అదే సక్సెస్ సీక్రెట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న బ్యానర్లలో ఒకటిగా హోంబలే బ్యానర్ గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే హోంబలే బ్యానర్ కు ఈ సక్సెస్ సులువుగా దక్కలేదు. కర్ణాటకకు చెందిన విజయ్ కిరంగదూర్, చలువే గౌడ, కార్తీక్ గౌడలకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండటంతో 2013 సంవత్సరంలో హోంబలే ఫిల్మ్స్ ను స్థాపించడం జరిగింది. తమ ఇలవేల్పు హోంబలమ్మ పేరును బ్యానర్ కు ఈ నిర్మాతలు పెట్టడం గమనార్హం.

తొలి ప్రయత్నంలో భాగంగా పునీత్ రాజ్ కుమార్ తో నిన్నిందలే సినిమాను ఈ నిర్మాతలు నిర్మించగా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఈ నిర్మాతలు మాస్టర్ పీస్ అనే సినిమాను నిర్మించి ఆ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో యశ్ హీరోగా నటించారు. ఆ తర్వాత (Hombale) హోంబలే నిర్మాతలు నిర్మించిన రాజకుమార్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది.

ఆ తర్వాత ఈ బ్యానర్ లో తెరకెక్కిన కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు సక్సెస్ అయ్యాయి. రాజకుమార తర్వాత ఈ నిర్మాతలు పునీత్ తో యువరత్న సినిమాను తెరకెక్కించారు. కాంతార సినిమాతో ఈ బ్యానర్ రేంజ్ మరింత పెరిగింది. సలార్ మూవీతో హోంబలే ఫిల్మ్స్ నిర్మాతలు మరింత సత్తా చాటారు. సలార్ మూవీ ప్రభాస్ కటౌట్ కు తగ్గ సినిమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మేము ఏ కథనైనా ప్రేక్షకుల కోణంలో చూస్తామని ఎలాంటి అంశాలు ఉంటే ఆడియన్స్ కు నచ్చుతుంది? కొత్తగా ఏం చూపించాలి? అనేది ఆలోచిస్తామని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మన మూలాలను గుర్తు చేసుకుంటూ సినిమాలను తెరకెక్కించాలని అనుకుంటున్నామని నిర్మాతలు చెప్పుకొచ్చారు. నిర్మాతలు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus