మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ అసలు పేరు కళ్యాణ్ బాబు. హీరోగా మారడానికి ముందు తన చిన్నన్నయ్య నాగ బాబు నిర్మించిన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఇక ‘అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి’ చిత్రంతో హీరోగా మారిన పవన్ కళ్యాణ్ పేరు… కళ్యాణ్ అనే పడింది. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు కూడా . అయితే ‘గోకులంలో సీత’ సినిమా సూపర్ హిట్ అవ్వడం.
ఈ చిత్రానికి రచయితగా పనిచేసిన పోసాని కృష్ణమురళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఓ ప్రెస్ మీట్ లో చెప్పడం. దాంతో మీడియా వారు కళ్యాణ్ పేరుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని రాయడంతో పేరు మారిపోయింది. ‘గోకులంలో సీత’ హిట్టయ్యింది కాబట్టి పవర్ స్టార్ ట్యాగ్ బాగా ఫేమస్ అయిపొయింది. ఇక ‘సుస్వాగతం’ సినిమాకి మొదటి సారీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని పేరు పడింది.
అప్పటి నుండీ సినిమాలు అన్నీ సూపర్ హిట్లు కావడంతో పవన్ కళ్యాణ్ పేరు మరింత పాపులర్ అయ్యింది. ఇలా పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు రావడానికి కారణం.. పోసాని కృష్ణమురళి అనే చెప్పాలి. ఇదే విషయాన్ని పోసాని కూడా అనేక సందర్భాల్లో తెలిపిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ అనే ట్యాగ్ కు తగినట్టుగానే పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ ను పెంచుకుంటూనే వచ్చాడు.
Most Recommended Video
అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు