రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో కాంతార మూవీ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన రిషబ్ శెట్టి, సప్తమీ గౌడ తమ నటనతో మెప్పించడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో రెండో వీకెండ్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాగా రికార్డు స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం.
కాంతార సినిమాలో రిషబ్ శెట్టి తల్లి పాత్రలో మానసి సుధీర్ అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో కమల పాత్రకు మానసి సుధీర్ పూర్తి స్థాయిలో న్యాయం చేయడం గమనార్హం. లాక్ డౌన్ సమయంలో పిల్లల ప్రదర్శన పాటలను పాడటం ద్వారా మానసి సుధీర్ పాపులారిటీని పెంచుకున్నారు. వృత్తిరిత్యా మానసి సుధీర్ టీచర్ కావడం గమనార్హం. కాంతార సినిమా సక్సెస్ సాధించడంతో మానసి సుధీర్ కు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.
నటిగా అనుభవం లేకపోయినా కాంతార సినిమాలో ఎంతో అనుభవం ఉన్న నటిలా నటించి మానసి సుధీర్ ప్రశంసలను అందుకోవడం గమనార్హం. మానసి సుధీర్ కెరీర్ పరంగా మరెంతో సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కాంతార సినిమా తర్వాత మానసి సుధీర్ కు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కొత్త తరహా కథ, కథనంతో తెరకెక్కిస్తే సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాయని కాంతార మూవీ ప్రూవ్ చేసింది.
హోంబులే బ్యానర్ నిర్మాతలు నిర్మించిన సినిమాలన్నీ అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. కాంతార మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో రిషబ్ శెట్టి తర్వాత సినిమాలు ఎలాంటి కథాంశాలతో తెరకెక్కుతాయో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో కూడా కన్నడలోనే సినిమాలను తెరకెక్కించి ఇతర భాషల్లోకి డబ్ చేస్తానని రిషబ్ శెట్టి చెబుతున్నారు.