Major Movie: నిర్మాతగా మహేష్ ఖాతాలో హిట్ చేరినట్టేనా?

మరో రెండు రోజుల్లో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణంగా అడివి శేష్ సినిమాలు అంటే ఏదో ఒక ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఈ మధ్య కాలంలో అడివి శేష్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు హిట్లుగా నిలిచాయి. భారీ బడ్జెట్ తో శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డి, హీరో మహేష్ బాబు నిర్మాతలుగా తెరకెక్కడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ టికెట్ రేట్లతోనే ఈ సినిమా విడుదలవుతూ ఉండటం ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. దాదాపుగా 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి అమ్మారని తెలుస్తోంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ థియేటర్లలో 2 తేదీ రాత్రి నుంచి మేజర్ సినిమా ప్రదర్శితం కానుంది.

ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటంతో మేజర్ చిత్ర యూనిట్ ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో నిర్మాతగా మహేష్ బాబు ఖాతాలో సక్సెస్ చేరినట్టేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమాసినిమాకు క్రేజ్ ను పెంచుకుంటున్న అడివి శేష్ ఈ సినిమాతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటే మిడిల్ రేంజ్ హీరోల జాబితాలో అడివి శేష్ కూడా చేరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

అడివి శేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఉండేలా ఈ సినిమా మేకర్స్ జాగ్రత్త పడ్డారని సమాచారం.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus