Chiranjeevi: మెగాస్టార్ సినిమాల రిలీజ్ డేట్ల వెనుక కథ ఇదే?

స్టార్ హీరో చిరంజీవి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. చిరంజీవి రీఎంట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆచార్య సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా చిరంజీవి మినిమం గ్యాప్ లో తను హీరోగా తెరకెక్కిన మూడు సినిమాలను రిలీజ్ చేయనున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ఆగష్టులో రిలీజ్ కానుందని ప్రచారం జరిగినా గత కొన్నిరోజులుగా దసరాకు ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

అయితే గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు బాబీ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. టైటిల్ ను అధికారికంగా ప్రకటించకపోయినా రిలీజ్ డేట్ ను మాత్రం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ఇలా పండుగలకే తన సినిమాలను విడుదల చేయడానికి కారణం ఆచార్య అని తెలుస్తోంది.

సాధారణంగా పండుగల సమయంలో సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయి. ఒకవేళ సినిమాకు హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయనే సంగతి తెలిసిందే. చిరంజీవి తర్వాత సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తర్వాత సినిమాలు కచ్చితంగా మంచి ఫలితాన్ని సొంతం చేసుకునే విధంగా చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

టాలెంటెడ్ డైరెక్టర్లకు వరుసగా అవకాశాలను ఇస్తున్న చిరంజీవి ఈ సినిమాలు విడుదలైన తర్వాత కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారు. మరో నాలుగేళ్ల పాటు హీరోగా బిజీగా ఉండాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. చిరంజీవికి రోజురోజుకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus