మణిరత్నం కలల ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’లో రెండో సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. గతేడాది వచ్చిన తొలి సినిమాకు మంచి స్పందనే వచ్చింది. మిగలిన ఇండస్ట్రీల్లో ఓకే అనిపించుకున్నా.. తమిళనాట మాత్రం అదరగొట్టేసింది. భారీ వసూళ్లతో వావ్ అనిపించింది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు రెండో పార్ట్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.
‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) నవలను సినిమాగా తీయాలని కథ హక్కులను అలనాటి నటుడు ఎంజీ రామచంద్రన్ 1985లోనే కొనుగోలు చేశారట. త్వరలోనే షూటింగ్ అనుకునేసరికి ఆయన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అయితే ఈ క్రమంలో కథా హక్కులను రెన్యువల్ చేయలేదు. ఆ తర్వాత సినిమా ఆలోచనలోనే ఉండిపోయింది. ఆ తర్వాత కమల్‌హాసన్ కూడా ఈ సినిమా చేద్దాం అనుకున్నారట. మణిరత్నంతో కొంత వర్క్ చేశారు. అయితే వివిధ కారణాల వల్ల ఆగిపోయారు.
మణిరత్నం కూడా చాలా సార్లు సినిమా గురించి ఆలోచించినా.. మన సినిమాకు ఆ స్థాయి బజ్, బడ్జెట్‌కి తగ్గ వసూళ్లు సాధ్యమేనా అనుకున్నారు. అయితే ‘బాహుబలి’ సినిమాలతో రాజమౌళి ముందుకు రావడంతో.. ఆ ధైర్యం చూసి మణిరత్నం ముందుకొచ్చారు. ఎట్టకేలకు 2019లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. లైకా ప్రొడక్షన్స్ రూ.500కోట్ల బడ్జెట్‌తో సినిమా స్టార్ట్ చేసింది. కథ సిద్ధం చేసిన తర్వాత రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించారు.
చోళ రాజ్య వైభవం నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ సినిమాలోని ప్రధాన పాత్రల కోసం మణిరత్నం చాలామంద నటులను సంప్రదించారు. అరుణ్‌మొళి వర్మన్, వల్లవరాయ వందియదేవన్ పాత్రలకు మహేశ్, విజయ్‌లను అనుకున్నారట. అయితే అది వీలుకాక.. జయం రవి, కార్తి చేశారు. త్రిష పాత్ర కూడా అదిరిపోయింది అని చెప్పాలి. ఇక ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం గమనార్హం. అయితే మీరు ఇక రెడీనా రేపే మరి సినిమా వచ్చేది.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?