Pushpa 3: బన్నీ సుకుమార్ కాంబో విషయంలో అలా జరగనుందా?

బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించడంతో పుష్ప ది రూల్ పై కూడా భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయనే సంగతి తెలిసిందే. అయితే కొన్నిరోజుల క్రితం ఫహద్ ఫాజిల్ చేసిన కామెంట్ల వల్ల పుష్ప3 కూడా ఉండవచ్చని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే నెటిజన్లు మాత్రం పుష్ప మూవీని పుష్ప ది రూల్ తో ఆపేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పుష్ప సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించాలని

అనుకుంటే కథలో సత్తా ఉండాలని పుష్ప ది రైజ్ కథ విషయంలోనే నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ లేదా సుకుమార్ పుష్ప3 మూవీ గురించి కామెంట్లు చేయలేదనే సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి కూడా పుష్ప3 సినిమా లేదని తెలుస్తోంది. సుకుమార్ మనసులో పుష్ప3 సినిమాకు సంబంధించిన ఐడియా మాత్రం ఉందని బోగట్టా. సుకుమార్ పుష్ప2 ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప3 గురించి చెప్పే ఛాన్స్ అయితే ఉంది.

ఇప్పటికైతే పుష్ప3 గురించి సుకుమార్ బన్నీతో కానీ నిర్మాతలతో కానీ చర్చించలేదని బోగట్టా. మరోవైపు పుష్ప ది రూల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది. వర్షాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని బోగట్టా. రష్మిక పాత్ర చనిపోతుందని వార్తలు వైరల్ కాగా ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. సినిమాసినిమాకు రష్మిక రేంజ్ పెరుగుతుండగా రష్మిక తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

బాలీవుడ్ ఆఫర్లతో కూడా రష్మిక బిజీ అవుతుండగా రాబోయే రోజుల్లో రష్మిక ఎంపీ అవుతుందని వేణుస్వామి జ్యోతిష్యం చెప్పారనే సంగతి తెలిసిందే. మరి రష్మిక నిజంగానే రాజకీయాలపై దృష్టి పెట్టి ఎంపీ అవుతారేమో చూడాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus