Rhea Singha: ‘జెట్లీ’తో రాబోతున్న రియా గురించి తెలుసా? గతేడాది ఆమె..!

కమెడియన్‌ సత్య ఇప్పటికే హీరోగా ఓ సినిమా చేశాడు. ఆ తర్వాత ఒకట్రెండు ప్రయత్నాలు జరిగినా ముందుకు వెళ్లలేదు. అయితే ఇప్పుడు సెటైరికల్‌ డైరక్టర్‌, సత్యకు బాగా దగ్గరైన దర్శకుడు రితేశ్‌ రాణా కొత్త సినిమాతో మరోసారి సత్య హీరో అయిపోయాడు. ఆ సినిమానే ‘జెట్‌లీ’. రితేశ్‌ గత సినిమాల్లాగే ఈ సినిమా కూడా సెటైరికల్‌గానే సాగనుంది అని పోస్టర్‌, ఆ తర్వాత వచ్చిన ప్రచార వీడియోలు చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు సినిమా టీమ్‌ హీరోయిన్‌ ఎవరు అనేది రివీల్‌ చేసింది.

Rhea Singha

‘రియా ఎవరు?’ అంటూ ఓ వీడియో ఇప్పటికే ఆమె పేరు టీజ్‌ చేసిన టీమ్‌.. ఆమె రియా సింఘా అని ఓ పోస్టర్‌ను లాంచ్‌ చేసింది. రియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆమె ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. శివానీ రాయ్‌గా కనిపించనున్న ఆమె యాక్షన్‌ టచ్‌ ఉన్న పాత్రలో ఆమె నటిస్తున్నట్లు ఆ పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది. దీంతో రియా సింఘా ఎవరు అని చూస్తే.. ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. గుజరాత్‌కు చెందిన రియా.. 18 ఏళ్ల వయసులోనే మిస్‌ యూనివర్స్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకుంది. గతేడాది ఈ ఘనత సాధించింది.

రియా అంతకుముందు అంటే 2023లో ‘మిస్‌ టీన్‌ గుజరాత్‌’, ‘మిస్‌ టీన్‌ ఎర్త్‌’గా నిలిచింది. ఇక ‘మిస్‌ యూనివర్స్‌ 2024’ టాప్‌ 30లో రియా నిలిచింది. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉన్న రియా.. స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుండే మోడలింగ్‌ చేసింది. టెడెక్స్‌ స్పీకర్‌గా కూడా వ్యవహరించింది. పర్ఫామింగ్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ చేసింది. ఇప్పుడు ‘జెట్‌లీ’ సినిమాతో తెలుగులోకి వస్తోంది. ఈ సినిమా అంతా ఫ్లైట్‌లోనే జరుగుతుంది అని రితేశ్‌ రాణా ఇప్పటికే చెప్పారు. ఆ లెక్కన రియా అయితే ఫ్లైట్‌ హోస్టెస్‌ లేదా సెక్యూరిటీ పర్సన్‌ అవ్వాలి.

రూ.99కే సినిమా.. వీళ్లయినా మాట నిలబెట్టుకుంటారా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus