కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు అజిత్ ఒకరు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక అజిత్ నటి శాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే వివాహం తర్వాత షాలిని పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కేవలం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అజిత్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. గత కొద్దిరోజుల క్రితం వరకు అజిత్ శాలిని విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అయింది అయితే ఈ వార్తలకు షాలిని పులిస్టాప్ పెట్టారు.
తాజగా ప్రముఖ సినీ జర్నలిస్ట్ అయినటువంటి బైల్వాన్ రంగనాథన్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ కోలీవుడ్ సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన అజిత్ లవ్ స్టోరీల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన హీరోయిన్ శాలినినీ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కంటే ముందుగానే మరొక హీరోయిన్ ప్రేమలో పడి ఏకంగా తనని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు అంటూ ఈయన వెల్లడించారు.
శాలిని కంటే అజిత్ (Ajith) ముందుగా హీరా రాజగోపాల్ అనే హీరోయిన్ ప్రేమించారట. ఇక వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా వీరి ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. ఇక బ్రేకప్ తర్వాత అజిత్ షాలిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండగా హీరా రాజగోపాల్ మాత్రం ఇప్పటికి ఒంటరిగానే ఉంటున్నారు.