Lavanya Tripathi: మెగా కోడలన్న ఉద్దేశంతోనే కోట్లు నష్టపోయిన లావణ్య త్రిపాఠి!

నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ నిశ్చితార్థం కావడంతో ఈమెకు మెగా కోడలు అనే ట్యాగ్ పడిపోయింది. ఇలా మెగా కోడలు కాబోతున్నటువంటి లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందే భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి మెగా ఇంటికి కోడలు కాబోతున్నటువంటి తరుణంలో ఏకంగా మూడు కోట్ల రూపాయల వరకు నష్టం ఎదుర్కొంటున్నారని సమాచారం.

లావణ్య త్రిపాటి సినిమాలలో హీరోయిన్ గా కొనసాగడమే కాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇప్పటికే పులి మేక అనే వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించి సందడి చేశారు. ఇక పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సినిమాలలో నటించడానికి మెగా కుటుంబానికి ఏమాత్రం అభ్యంతరం లేదు కానీ ఎక్స్పోజింగ్ పాత్రలలో మాత్రం నటించకూడదని కండిషన్ అయితే పెట్టారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తమిళ్ ఒక వెబ్ సిరీస్ లో ఈమెకు మంచి అవకాశం వచ్చిందట అయితే ఈ అవకాశాన్ని లావణ్య త్రిపాఠి వదులుకున్నారని తెలుస్తోంది. ఇందులో కాస్త బోల్డ్ సీన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈమె ఈ వెబ్ సిరీస్ కు నో చెప్పారని తెలుస్తోంది. అయితే ఈ సిరీస్లో నటించడం కోసం మేకర్స్ తనకు భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట. అయినప్పటికీ ఈమె మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని తాను ఈ వెబ్ సిరీస్ లో నటించనని తేల్చి చెప్పారట.

ఈ విధంగా ఈ వెబ్ సిరీస్ ను (Lavanya Tripathi) లావణ్య త్రిపాఠి రిజెక్ట్ చేయడంతో ఈమె దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగా నష్టపోయిందని తెలుస్తుంది. మెగా ఇంటికి కోడలు కావడంతోనే ఇలాంటి వెబ్ సిరీస్ లలో నటించడానికి ఈమె నో చెప్పారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ తో ఇదివరకే నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈమె ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో పెళ్లికూడా చేసుకోబోతున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus