Mahesh Babu, Namrata: మహేష్ నమ్రత ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక మహేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్ నమ్రతను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరూ వంశీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడటం అనంతరం ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఈ విధంగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి నమ్రత ఇల్లు పిల్లల బాధ్యతలను చూసుకోవడమే కాకుండా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు.

మహేష్ బాబు (Mahesh Babu) ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిలో ఎవరు ముందుగా వారి ప్రేమను తెలియజేశారు అసలు వీరిద్దరూ ఎక్కడ ప్రేమలో పడ్డారనే విషయాల గురించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. మహేష్ బాబు నమ్రత వంశీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారట కానీ వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని గ్రహించింది మాత్రం న్యూజిలాండ్ లో అని తెలుస్తుంది..

ఈ సినిమా షూటింగ్లో భాగంగా దాదాపు 25 రోజులపాటు న్యూజిలాండ్ వెళ్లారట అయితే అక్కడ వీరిద్దరి మధ్య కాస్త చనువు పెరిగిందని అక్కడే వీరిద్దరిలో ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఈ విధంగా న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత ఇండియా చేరుకున్నారు. ఇక నమ్రత మహేష్ బాబు ప్రేమలో పడటంతో ఈమె ముందుగా మహేష్ బాబుకు తన ప్రేమ విషయాన్ని వ్యక్తం చేశారట.

అప్పటికే నమ్రతతో ప్రేమలో ఉన్నటువంటి మహేష్ బాబు ఆ ప్రేమ విషయాన్ని బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకున్నారు. అయితే నమ్రత తనకు ప్రపోజ్ చేయడంతో ఈయన ఏమాత్రం ఆలోచించకుండా నమ్రత ప్రేమను యాక్సెప్ట్ చేశారని తెలుస్తోంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus