Roja Daughter: స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ గా రోజా కూతురు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి హీరోయిన్గా సక్సెస్ అయ్యారు. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే తమిళ దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉన్నారు ఇక రోజాకి మొదటి సంతానంగా కూతురు అన్షు మాలిక జన్మించిన సంగతి తెలిసిందే.

ఈమె ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇంత చిన్న వయసులోనే అన్షు మాలిక ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. అచ్చం రోజా పోలికలతో ఉన్నటువంటి అన్షు సినిమాలలోకి వస్తే మంచి సక్సెస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెడితే అన్షు కూడా తన తల్లి మాదిరిగానే స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుందని అందరూ భావించారు.

ఈ క్రమంలోనే పలువురు దర్శక నిర్మాతలు రోజా దంపతులను కలిసి తమ కూతురిని ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేసే అవకాశం మాకే ఇవ్వాలి అంటూ అడుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇదివరకే స్టార్ హీరో విక్రమ్ కుమారుడితో కలిసి ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం కాబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇలా అన్షు ఇండస్ట్రీ ఎంట్రీ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈ విషయంపై రోజా సెల్వమని దంపతులు అధికారకంగా మాత్రం తెలియ చేయలేదని తెలుస్తుంది.

ప్రస్తుతం అన్షు ఉన్నత చదువులను చదువుతున్న నేపథ్యంలో ఈమె సినీ కెరియర్ పై ఫోకస్ పెట్టలేదని తనకు ఆసక్తి ఉంటే తప్పకుండా సినిమాలలోకి తీసుకు వస్తామని ఇదివరకే పలు సందర్భాలలో రోజా తెలియజేశారు. ఇక ప్రస్తుతం (Roja) రోజా ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus