Jr NTR, Koratala Siva: తారక్ మూవీ స్క్రీన్ ప్లేను కొరటాల మారుస్తున్నారా?

ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో తారక్ కొరటాల శివ కాంబో సినిమాపై ఈ ఎఫెక్ట్ కచ్చితంగా కొంతమేర పడుతుందనడంలో సందేహం అవసరం లేదు. అయితే ఆచార్య రిజల్ట్ వల్ల తారక్ కొరటాల మూవీ స్క్రిప్ట్ లో మార్పులు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న ఈ ప్రచారం వల్ల తారక్, కొరటాల అభిమానులు టెన్షన్ పడుతుండటం గమనార్హం.

అయితే కొరటాల శివ సన్నిహితులు మాత్రం వైరల్ అవుతున్న వార్తలను నమ్మవద్దని ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివను ఒత్తిడి తీసుకోవద్దని జయాపజయాలు సాధారణం అని సూచించారని బోగట్టా. అవసరమైతే ఈ ప్రాజెక్ట్ ను మరింత ఆలస్యంగా ప్రారంభిద్దామని ఎన్టీఆర్ కొరటాల శివకు చెప్పారని సమాచారం అందుతోంది.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్లు కొరటాల శివను ఒకింత బాధ పెట్టాయని తెలుస్తోంది. కొరటాల శివ తారక్ సినిమా స్క్రిప్ట్ ను మరోసారి పరిశీలించి ఈ సినిమా విషయంలో ముందుకెళ్లనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా టెక్నీషియన్లకు సంబంధించి స్వల్పంగా మార్పులు చోటు చేసుకునే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్, సుధాకర్ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. తారక్ తో గతంలో ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్లు తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. ఈ సినిమాతో కూడా అదే ఫలితం రిపీట్ కానుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ తో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం అందుతోంది. తారక్ ఈ సినిమా కొరకు 55 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోనున్నారు. ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా పట్టాలెక్కనుంది. ప్రశాంత్ నీల్ ఫేవరెట్ హీరో తారక్ కావడంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus