Chiranjeevi: వేదాళం డైరెక్టర్ కసితో పని చేస్తున్నాడట!

మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వేదాళం రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటించనున్నారు. ఇప్పటికే అన్నాత్తే సినిమాలో రజనీ సోదరిగా నటిస్తున్న కీర్తి సురేష్ వేదాళం రీమేక్ కోసం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. షాడో తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.మెహర్ రమేష్ ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని కసితో పని చేస్తున్నారు.

సినిమాలో పక్కా కమర్షియల్ అంశాలు ఉండే విధంగా మెహర్ రమేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవి కీర్తి సురేష్ కాంబినేషన్ లో వచ్చే సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ కు సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట, అన్నాత్తే, వేదాళం రీమేక్ పైనే కీర్తి సురేష్ ఆశలు పెట్టుకున్నారు.

మరోవైపు చిరంజీవి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావాల్సి ఉండగా త్వరలో వేదాళం రీమేక్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా గురించి పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. రొటీన్ మాస్ మసాలా మూవీ అయినప్పటికీ చిరంజీవి నటిస్తుండటంతో వేదాళం రీమేక్ పై అంచనాలు పెరిగాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus