ఈ నాలుగు సినిమాల మధ్య ఉన్న ఆసక్తికరమైన పోలిక ఏంటో తెలుసా!

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాల మధ్య భలే పోలికలు కుదురుతుంటాయి.. స్టార్స్, టెక్నీషియన్స్, రిలీజ్ డేట్స్, రికార్డ్స్, స్టోరీస్, సాంగ్స్.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా విషయాలుంటాయి.. అలాంటి రేర్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆడియన్స్‌ని ఎప్పుడూ అలరిస్తుంటాయి.. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, యాంగ్రీ స్టార్ డా.రాజ శేఖర్.. ఈ నలుగురూ నటించిన సినిమాలకు మధ్య ఎలాంటి లింక్ కుదిరింది అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..

దొరగారికి దొంగపెళ్ళాం..

సూపర్ స్టార్, నటశేఖర కృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో హీరోయిన్లుగా.. ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘దొరగారికి దొంగపెళ్ళాం’.. రాజ్ – కోటి సంగీతమందించిన ఆడియో క్లిక్ అయింది.

ఎస్.పి.పరశురాం..

మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా.. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఎస్.పి.పరశురాం’.. స్వరవాణి ఎమ్.ఎమ్. కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి..

ముద్దుల ప్రియుడు..

విక్టరీ వెంకటేష్, రమ్యకృష్ణ, రంభలతో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తీసిన మూవీ ‘ముద్దుల ప్రియుడు’.. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకుడు.. వీరి కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. సాంగ్స్ అన్నీ అదిరిపోతాయి..

గ్యాంగ్ మాస్టర్..

యాంగ్రీ స్టార్. డా.రాజ శేఖర్, నగ్మా నాయకా నాయికలుగా.. స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ తెరకెక్కించిన ఫిలిం ‘గ్యాంగ్ మాస్టర్’.. ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీతమందించారు. ఇక ఆయన మ్యూజిక్ గురించి మాట్లాడేదేముంది?.. సాంగ్స్ అలరించాయి..

కృష్ణ, చిరు, వెంకీ, రాజ శేఖర్ చేసిన ఈ నాలుగు సినిమాలనూ పెద్ద దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు తెరకెక్కించారు. టాప్ టెక్నీషియన్స్, భారీ బడ్జెట్, హెవీ స్టార్ కాస్టింగ్ లాంటివి చాలానే ఉన్నాయి. రాజ శేఖర్ సినిమాకి రెహమాన్ సంగీతమందించారనే సంగతి చాలా మందికి తెలియదు. ఇక ఈ సినిమాల మధ్య ఉన్న పోలిక ఏంటంటే.. ఈ నాలుగు సినిమాల్లోనూ సాంగ్స్ బాగుంటాయి. కానీ బాక్సాఫీస్ బరిలో నాలుగు చిత్రాలూ ఫ్లాప్‌గా నిలిచాయి. భారీ అంచనాలతో బిగ్ స్టార్స్ చేసిన ఈ మూవీస్ ప్రేక్షకాభిమానులను అలరించే విషయంలో తడబడ్డాయి..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus