Bobby, Balakrishna: బాలయ్య మూవీ ఇంటర్వెల్ గురించి షాకింగ్ అప్డేట్.. ఫ్యాన్స్ సంతోషించేలా?

2024 సంవత్సరంలో రిలీజ్ కానున్న సినిమాలలో బాలయ్య బాబీ కాంబో మూవీ ఒకటి కాగా ఈ సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరుగుతున్నాయి. బాలయ్య బాబీ కాంబో మూవీ బాలయ్య ఖాతాలో వరుసగా నాలుగో హిట్ గా నిలుస్తుందని బాబీకి వాల్తేరు వీరయ్య సినిమాకు మించిన సక్సెస్ ను అందిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా ఇంటర్వెల్ కు సంబంధించి షాకింగ్ అప్ డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అదిరిపోయే యాక్షన్స్ సీక్వెన్స్ తో ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ ను ప్లాన్ చేశారని ఆ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.

బాలయ్య మాస్ డైలాగ్స్ చెబుతూ ఇంటర్వెల్ సీన్ లో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారని తెలుస్తోంది. బాలయ్య నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని సమాచారం అందుతుండటం గమనార్హం. బాలయ్య బాబీ కాంబో మూవీ సమ్మర్ లో రిలీజవుతుందని ప్రచారం జరుగుతున్నా ఆ సమయానికి ఈ సినిమాను రిలీజ్ చేయ్ అడం సులువైన విషయం కాదని తెలుస్తోంది. దసరా పండుగ కానుకగా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతానికి దసరా రేసులో పెద్ద సినిమాలేవీ లేవు. బాలయ్య సినిమాకు పోటీ సినిమాలను రిలీజ్ చేయడానికి ఇతర సినిమాల దర్శకనిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. సితార నిర్మాతలు భారీ మొత్తంలో ఈ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య లుక్స్ కూడా కొత్తగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

బాలయ్య (Balakrishna) బాబీ కాంబో మూవీ బిజినెస్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. బాలయ్య మాస్ ప్రేక్షకులను మెప్పించే కథాంశాలకు ఓటేస్తున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus