సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి, క్రియేట్ అవ్వడానికి చిత్రబృందం అప్పుడప్పుడు సినిమా గురించి చెబుతూ ఉంటారు. అంతకుముందు హీరో – హీరోయిన్, హీరో – డైరక్టర్, మ్యూజిక్ డైరక్టర్ లాంటి కాంబోల పేరు మీద హైప్ వస్తుంటుంది. అదే సినిమాలోని కొన్ని సీన్స్ గురించి హైప్ క్రియేట్ చేస్తే అది ‘పుష్ప’ అవుతుంది. ఇటీవల పుష్పలోని ఓ పాట, సీన్‌ను ఎవరో చెట్టు మీద నుంచి కూర్చొని రికార్డు చేసి లీక్ చేశారు. అది చూసి థ్రిల్ అయిన ప్రేక్షకులకు ఇప్పుడు ఇంకో వండర్‌ఫుల్ లీక్. అయితే ఈసారి ఇది చిత్రబృందం నుంచే.
‘పుష్ప’లో మేజర్ పార్ట్ అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతోందనే విషయం తెలిసిందే. సినిమా ప్రచార చిత్రాల్లో అదే చూపించారు. దీంతో ఫారెస్ట్ సీన్స్ విషయంలో సుకుమార్ బ్రెయిన్ కనిపించబోతోంది. అందులో మచ్చుకు రెండు సీన్స్ గురించి చిత్రబృందం ‘ఉప్పెన’ ప్రచార కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. అందులో దేవిశ్రీప్రసాద్ చెప్పిన సీన్ అయితే ఇంకా హైలైట్ అంటున్నారు. ఓ సీన్ కోసం కొండ మీద 500 మందిని పెట్టి… దిగువ కెమెరా పెట్టి తీశారట. వినడానికి సులభంగా అనిపిస్తున్నా… ఆ 500 మందిని కొండ మీదకు పంపడానికి సుక్కు అండ్ టీమ్ ఏకంగా ఆ కొండపై చిన్న రోడ్డే వేసేశారట. రోడ్డును కొద్దిగా సెట్ చేసుకుంటూ లారీలతో పైకి 500 మందిని పంపించారట. ఈ సీన్ చూసి నిర్మాతలు చాలా ఆనందంగా తనతోచెప్పారని దేవిశ్రీప్రసాద్ చెప్పుకొచ్చాడు.
ఇక నిర్మాతలు కూడా ఓ సీన్ గురించి చెప్పుకొచ్చారు నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్. కేబుల్ కెమెరాను పై నుంచి కిందకు దించుతూ, గింబల్‌లోకి తీసుకెళ్లేలా షూట్‌ను ప్లాన్ చేశారట సుకుమార్. అయితే ఈ సీన్ తీస్తున్నప్పుడు వర్షం పడటంతో షూటింగ్ డిస్ట్రబ్ అయ్యిందట. ఏదో బాగానే వచ్చిందని సుకుమార్ అనుకుంటే, ఏముంది రేపు తీసుకోవచ్చు కదా అని నిర్మాతలు అన్నారట. ఖర్చుకు వెనుకాడని నిర్మాతల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమా చక్కగా రావడానికి వారు పడుతున్న తపన నచ్చిందంటూ సుకుమార్ చెప్పుకొచ్చారు. సీన్ చెబుతున్నప్పుడు నిర్మాత కళ్లలో ఆనందం చూస్తుంటే.. ఇది కూడా వావ్ అనిపించేలా ఉంది. ఇంకా ఇలాంటి సీన్లు చాలా ఉన్నాయట.
Most Recommended Video
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?