Acharaya: ‘ఆచార్య’ సెట్‌కు అంతెందుకు ఖర్చు పెట్టారంటే

  • April 23, 2021 / 03:48 PM IST

చిరంజీవి ‘ఆచార్య’ సినిమా గురించి ఎక్కువగా వినిపించే అంశాలు అంటే చిరంజీవి, రామ్‌చరణ్‌ మూడోది ధర్మస్థలి. ఇప్పికే టీజర్‌, మొదటిపాట చూసినవారికి ధర్మస్థలి అంటే ఏంటో తెలిసిపోతుంది. చూడటానికి చాలా బాగుంది అని అందరూ చెబుతున్నారు. కనిపించిన, నాలుగైదు సీన్లు, పాటలో అయితే నిజంగా బాగానే ఉంది. మరి అంతగా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్న ధర్మస్థలి గురించి ఇంకొంచెం తెలుసుకుంటే బాగుంటుంది కదా. అందుకే ఈ ప్రయత్నం. ఈ సెట్‌ను రూపొందించింది ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్‌ సెల్వరాజన్‌ అని మీకు తెలిసే ఉంటుంది.

20 ఎకరాల విస్తీర్ణంలో సుమారు ₹20 కోట్ల ఖర్చుతో ధర్మస్థలి సెట్‌ను నిర్మించారట. సినిమా సెట్‌ కోసం అంత ఖర్చు పెట్టడం అవసరమా? అనే ప్రశ్న చాలామందిలో వినిపిస్తుంటుంది. అయితే ఇదేదో మామూలు సెట్‌ కాదు కాబట్టే, అంత ఖర్చపెట్టి నిర్మించారని ఆర్ట్‌ డైరెక్టర్‌ సెల్వరాజన్‌ చెబుతున్నారు. సినిమా బడ్జెట్‌ హీరో రెమ్యూనరేషన్‌ తర్వాత ఈ సెట్‌దే ఖర్చుదే ఎక్కువ షేర్‌ అనే టాక్‌ కూడా వినిపిస్తోంది. దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయట.

‘ఆచార్య’లో 60 శాతం సీనట్లు ఈ ధర్మస్థలిలోనే ఉంటాయట. చిరంజీవి, రామ్‌చరణ్‌ కలసి ఆ ప్రాంతంలో చేసే సన్నివేశాలు సినిమాకు చాలా కీలకమట. దీంతోపాటు ఆ సెట్‌లో ఓ పాట, ఫైట్‌ కూడా ఉంటాయని అంటున్నారు. దీంతో ఆ సెట్‌ కోసం రామ్‌చరణ్‌ అంత ఖర్చ పెడుతున్నాడని టాక్‌. అదుకే సినిమా టీజర్‌, పాట, పోస్టర్లలో ఆ సెట్టే కనిపిస్తోంది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus