Sunaina: యూట్యూబర్‌ను పెళ్లి చేసుకుంటున్న యంగ్‌ హీరోయిన్‌… ఎవరంటే?

ఓ యువ హీరోయిన్‌ రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. దీనికి సంబంధించిన వార్త ఒకటి కోలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు ఓ ఫొటో కూడా వైరల్‌ అవుతోంది. తమిళ హీరోయిన్‌ కదా మనకెందుకు అని అనుకుంటారేమో.. ఆమె మనకు కూడా పరిచయమే. శ్రీవిష్ణు (Sree Vishnu) ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) సినిమాలో కథానాయికగా నటించింది. గుర్తొచ్చిందా.. క్యూట్‌ లుక్స్‌ సునయననే (Sunaina) ఇప్పుడు వార్తల్లో నిలిచిన యువ నటి. తెలుగులో సినిమాలు, సిరీస్‌లు అంటూ ప్రయత్నాలు చేసినా సరైన కెరీర్‌ బిల్డ్‌ అయ్యేలా కనిపించకపోవడంతో ఆమె తమిళానికే పరిమితం అయిపోయింది.

ఇప్పుడు అక్కడే వరుస సినిమాలు చేస్తోంది. అయితే సోషల్‌ మీడియా పుణ్యమా అని మనకు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఓ యూట్యూబర్‌కి మనసు ఇచ్చి, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకుంది. రహస్యంగా నిశ్చితార్దం చేసుకున్న సునయన కేవలం ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. అందులో పెళ్లి కొడుకు ఎవరు అనేది చెప్పలేదు. అయితే ఆమె ఎంత సీక్రెట్‌గా విషయాన్ని ఉంచినా, ఆ పెళ్లి కొడుకు ఎవరో తెలిసిపోయింది.

ఎందుకంటే ఆ ఫొటో ఆమె సినిమా ప్రచారం అని కొందరు కామెంట్లు చేయడం, వార్తలు రావడంతో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చింది కూడా. నా లేటెస్ట్‌ సోషల్‌ మీడియా పోస్ట్ గురించి కొన్ని ఆర్టికల్స్ వైరల్ అయ్యాయి. అందుకే ఈ విషయమై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను.. ‘నేను ఎంగేజ్డ్’ అని ప్రకటించింది. ఆమె చెప్పలేదు కానీ.. ఆమె ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వ్యక్తి ఒక ఫేమస్ అరబ్ యూట్యూబర్ అని, అతని పేరు ఖలీద్ అల్ అమేరీ అని తెలుస్తోంది.

ఎందుకంటే డౌట్‌ వచ్చి ఆమె ఇన్‌స్టాను రివైండ్‌ చేస్తే.. గతంలో ఇద్దరూ కలసి దిగిన ఫొటోలు కనిపించాయి. మరోవైపు ఖలీద్‌ కూడా ఇలాంటి ఫొటోనే షేర్‌ చేశాడు. దీంతో క్లారిటీ వచ్చింది. ‘కుమార్ వర్సెస్ కుమారి’ సినిమాతో 2005లో నటిగా ప్రయాణం మొదలుపెట్టిన సునయన.. 2008లో వచ్చిన ‘కాదలిల్ విడుదెన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాజా రాజ చోర’, ‘చంద్ర గ్రహణం’ సినిమాలతోపాటు ‘మీట్ క్యూట్’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించి మెప్పించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus