‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు మన ప్రభాస్. అందుకే కొత్త సినిమా అంటే మినిమం పాన్ ఇండియా ఉండాలి అనేలా తయారైంది పరిస్థితి. అయితే ఈ క్రమంలో ప్రభాస్ సినిమా మనకు దూరంగా వెళ్లిపోతోందా? అంటే అవుననే సమాధానం వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకు తాజా ఉదాహరణ ‘ఆదిపురుష్’. ఈ సినిమాను తెరకెక్కిస్తోంది బాలీవుడ్ నిర్మాణ సంస్థ, బాలీవుడ్ దర్శకుడు. అయితే అందులో తప్పేం లేదు. కానీ సినిమా మొత్తం బాలీవుడ్ జనాలే ఉంటే కష్టం మరి.
‘ఆది పురుష్’ సినిమా మొదలైనప్పుడు అందులో మనకు తెలిసిన ముఖం ప్రభాస్. సినిమా షూటింగ్ మొదలై ఇన్నాళ్లు గడిచిన తర్వాత… ఇప్పుడు చూసినా ప్రభాస్ ఒక్కడే. ఎందుకంటే సినిమాలో నటీనటుల ఎంపిక తీరు అలా జరుగుతోంది. సినిమాలో నాయికగా కృతి సనన్‌ను ఎంచుకున్నారు. ఆమె తెలుగు ప్రేక్షకులకు ఏమంత దగ్గర కాదు. ఎప్పుడో రెండు సినిమాలు చేసి వెళ్లిపోయింది. విలన్ సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక లక్ష్మణుడి పాత్ర సన్నీ సింగ్‌కి ఇచ్చారు. హనుమంతుడి పాత్ర దేవ్ దత్‌ను ఎంచుకున్నారు.
ఇదంతా చూస్తుంటే ‘ఆదిపురుష్’లో ప్రభాస్ తప్ప మరే తెలుగు యాక్టర్ కనిపించరేమో అనిపిస్తోంది. సినిమాలో ఉన్న మెయిన్ క్యారక్టర్లలో సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు మాత్రమే. వారంతా బాలీవుడ్ వాళ్లయితే ఇక సినిమాకు ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారు. సినిమాకు నేటివిటీ ఎంత ముఖ్యమో, కనెక్టివిటీ అంతే ముఖ్యం. రామాయణానికి నేటివిటీతో పని లేదు. కాస్త కనెక్టివిటీ అయినా ఉండాలి కదా.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!