సురేఖ మాటలు వెనక్కి తీసుకున్నా.. టాలీవుడ్‌ జనాల కౌంటర్లు.. ఎటుకు దారితీస్తుందో?

  • October 7, 2024 / 01:20 PM IST

తెలుగు సినిమాలో మేమంతా ఒక్కటే.. మాలో ఎవరిని ఏమన్నా అందరం రియాక్ట్‌ అవుతాం. మమ్మల్నే ఎందుకు అంటున్నారు అని రియాక్షన్‌ బలంగా ఇస్తాం అంటూ టాలీవుడ్‌ సినిమా జనాలు ఇటీవల పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో టాలీవుడ్‌ (Tollywood) చాలా స్ట్రాంగ్‌ అని చెప్పకనే చెప్పారు. అయితే టాలీవుడ్‌లో ఎవరికి ఇబ్బంది కలిగినా ఇదేలా ఉంటారా? అంటే లేరు అనే మాట కూడా ఉంది అనుకోండి. ఆ విషయం వదిలేస్తే ఇప్పుడు మూకుమ్మడిగా రియాక్ట్‌ అయిన టాలీవుడ్‌కి భవిష్యత్తు ఇలానే ఉంటుందా?

Tollywood

అయినా, ఇదేం ప్రశ్న! పరిశ్రమలో ఒకరిని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకోమంటారా? అని మీరు అనొచ్చు. అయితే ఇక్కడ సమస్య.. నిరసన వ్యక్తం చేయాలి కానీ.. మూకుమ్మడిగా దాడి చేసేలా ఆ నిరసన ఉండకూడదు అనే పాయింట్‌ మరచిపోయారా? తప్పు మాట మాట్లాడిన వ్యక్తి ఆ మాటల్ని వెనక్కి తీసుకున్నా ఆగకుండా అదే ఫ్లోలో ట్వీట్లు పెట్టుకుంటూ వెళ్లారు. మాటలు పడ్డ వ్యక్తి, ఆయన కుటుంబం కోర్టు మెట్లు ఎక్కంది కాబట్టి వాళ్లు చూసుకుంటారు అని అనుకోలేదు మన సెలబ్రిటీలు.

మహిళా మంత్రి తన మాటలు వెనక్కి తీసుకున్నా అలా ఎందుకు అన్నారు, ఆమె ఓ రాజకీయ నాయకుణ్ని కౌంటర్‌ చేస్తూ అలా అన్నారు కదా.. ఆ నాయకుడు రియాక్ట్‌ అవుతారు కదా అనే మాటలు వినిపిస్తున్నాయి. మాటలు పడ్డ వ్యక్తి కామ్‌గా ఉన్నారు, రియాక్ట్‌ అయినా మొత్తం కామెంట్స్‌ మీద రియాక్ట్‌ అవ్వలేదు కదా అనే కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం మహిళా మంత్రిని అందరూ కలిపి కౌంటర్‌ చేశారు కదా.. ఇకపై కూడా టాలీవుడ్‌ (Tollywood) పరిస్థితి ఇప్పట్లానే టాలీవుడ్‌లో ఉంటుందా అనే పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా లేని విధంగా, ఆ మాటకొస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఏ సినిమాకైనా తెలంగాణలో టికెట్‌ రేట్లు పెంచుకునే ఆప్షన్‌ ఉంది. అందుకే సాధారణ థియేటర్లలో కూడా సినిమా రిలీజ్‌ సమయంలో టికెట్‌ ధర రూ. 400కు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సినిమా పరిశ్రమ మీద తెలంగాణ ప్రభుత్వం రూల్స్‌ పక్కాగా పాటిస్తే పరిస్థితి ఏంటి అనే మాట చర్చలోకి వచ్చింది.

‘విశ్వం’ ట్రైన్‌ కామెడీ.. అంచనాలు ఎంతైనా పెట్టుకోండి అంటున్న శ్రీను వైట్ల.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus