Allu Arjun: బోయపాటితో సినిమాకి రెడీ అయిపోతున్న బన్నీ..ఇక అది లేనట్టే..!

‘ఐకాన్’ ఈ సినిమా అనౌన్స్ చేసి రెండేళ్ళు దాటింది. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళలేదు. దీని పై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అనేక కథనాలు పుట్టుకొచ్చాయి. పారితోషికం విషయంలో బన్నీకి దిల్ రాజుకి సెట్ అవ్వడం లేదని కొన్నాళ్ళు, స్క్రిప్ట్ విషయంలో దర్శకుడు వేణు శ్రీరామ్.. బన్నీని సంతృప్తి పరచలేదని కొన్నాళ్ళు.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని అది చేయడానికి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదని కొన్నాళ్ళు…

ఇలా రకరకాల ప్రచారం జరిగింది. అయితే ‘వకీల్ సాబ్’ సక్సెస్ అవ్వడంతో బన్నీ ముందుకొచ్చినట్టు వచ్చి మళ్ళీ సందిగ్ధంలో పడ్డాడు.మరోపక్క ‘పుష్ప’ పార్ట్ 1 తర్వాత ‘ఐకానే’ ఉంటుందని బన్నీ సన్నిహితుడు అయిన బన్నీ వాస్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవల అతను బన్నీ లైనప్స్ పై గ్యారెంటీ చెప్పలేను అని మాట మార్చాడు. ఎక్కువ శాతం బోయపాటి శ్రీనుతో బన్నీ నెక్స్ట్ మూవీ.. అదీ ‘పుష్ప’ పార్ట్ 2 మొదలయ్యే ముందు ఉంటుందని అతను హింట్ ఇచ్చాడు.

దాంతో ‘ఐకాన్’ మళ్ళీ షెడ్డుకి వెళ్ళినట్టు అయ్యింది. బోయపాటి వద్ద అదిరిపోయే స్క్రిప్ట్ ఉందని… బన్నీ అటు వైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ‘గీతా ఆర్ట్స్’ లోనే ఈ ప్రాజెక్టు ఉంటుంది. ‘అఖండ’ తర్వాత బన్నీ- బోయపాటి ల మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని టాక్ బలంగా వినిపిస్తుంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus