Akhanda Movie: స్టార్ హీరో బాలయ్య నిర్ణయం రైటా? రాంగా?

ఈ మధ్య కాలంలో థియేటర్లలో పవర్ ఫుల్ మాస్ సినిమా రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే. బాలయ్య నటించిన అఖండ ఎప్పుడు రిలీజవుతుందా? అని ఒక వర్గం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఇప్పటికే అఖండ షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరగడంతో పాటు త్వరలో రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది.

అయితే బాలకృష్ణ అఖండ మూవీ రిలీజ్ గురించి పట్టించుకోకుండా ఆహా ఓటీటీ కొరకు టాక్ షో చేస్తున్నారు. గతంలో బాలయ్య థియేటర్స్ వర్సెస్ ఓటీటీ అనే టాపిక్ గురించి స్పందిస్తూ ఓటీటీకే తన ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం మాత్రం టాక్ షోను హైలెట్ చేసే విధంగా ముందడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రోమోకు సంబంధించిన స్టిల్స్ రిలీజ్ కాగా ఈ షోపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.

స్టార్ హీరోలంతా సినిమాలతో బిజీగా ఉంటే బాలయ్య మాత్రం ఆయా హీరోలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. టాక్ షోకు హోస్ట్ గా చేయాలని బాలయ్య తీసుకున్న నిర్ణయం రైట్ కాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బాలయ్య అఖండ కంటే టాక్ షోకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అఖండపై ఆసక్తి తగ్గుతుందని కొంతమంది భావిస్తున్నారు. మరోవైపు టాక్ షో వల్ల బాలయ్య తర్వాత సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని బాలయ్య ఫ్యాన్స్ లో కొందరు భావిస్తున్నారు. ఈ కామెంట్ల విషయంలో బాలయ్య స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus