విడుదలైనప్పుడు ఫ్లాపై.. కొన్నాళ్ళ తర్వాత క్లాసిక్ హోదాను పొందిన చిత్రాల్లో “ఆరెంజ్” ఒకటి. విడుదలైనప్పుడు సినిమాను ద్వేషించిన జనాలందరూ ఇప్పుడు ఈ సినిమాను తెగ పొగిడేస్తుంటాడు. ఈ సినిమా ఈ టైంలో విడుదలై ఉంటే అదిరిపోయేది అని కామెంట్ చేస్తుంటారు. మరి ఈ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్నాడో ఏమో కానీ.. బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా అఖిల్ తో తెరకెక్కిస్తున్న సినిమా కథను “ఆరెంజ్” సినిమా కథకు పోలి ఉండడం కొందర్ని ఆశ్చర్యపరుస్తోంది.
ఈ సినిమాలో మరో ముఖ్యపాత్ర పోషిస్తున్న ముంబై భామ ఇటీవల ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ.. “ఈ సినిమాలో అఖిల్ పెళ్లి చేసుకున్నవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు అనే భ్రమలో.. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి అమ్మాయి కోసం వెతుకుతుంటాడు. ఆ క్రమంలో పెళ్ళైన మా జంట మధ్య ఉన్న గొడవలను చూసి మనసు మార్చుకుంటాడు” అని ఇంచుమించుగా కథ మొత్తం చెప్పుకొచ్చేసింది. ఇక ఆ ఇంటర్వ్యూ బయటకు వచ్చినప్పట్నుండి.. అఖిల్ 4వ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. దాంతో భాస్కర్ మళ్ళీ “ఆరెంజ్” సినిమానే తీస్తున్నాడా అని గుసగుసలు కాస్త గట్టిగా వినబడడం మొదలైంది.