Buchi Babu: హిట్‌ ఇచ్చాక స్టార్‌ హీరోను నమ్ముకుంటే ఇంతేనా?

నానా కష్టాలు పడి దర్శకుడు అవ్వడం, అన్నాళ్లూ రాసుకున్న కథను ఎంతో జాగ్రత్తగా తీసి హిట్‌ కొట్టడం, ఆ సినిమా విజయం ఇచ్చిన ఆనందాన్ని అనుభవిస్తూ కొత్త సినిమా ఎవరితో చేయాలి అనే ఆలోచన చేయడం, ఆఖరికి హీరోను పట్టేయడం, సినిమా మొదలెట్టేయడం. ఇదంతా పెద్ద ప్రాసెస్‌. ఈ క్రమంలో ఆఖరి నుండి రెండో స్టెప్‌ చాలా కష్టం, డేంజర్‌ కూడా. ఎందుకంటే ఈ క్రమంలో పట్టిన హీరో ఏ స్టార్‌ హీరోనో అయితే చాలా ఇబ్బందులు వస్తాయి. కావాలంటే రాధాకృష్ణ కుమార్‌ను అడగండి, లేదంటే బుచ్చిబాబు సానాని అడగండి చెబుతారు.

గోపీచంద్‌తో ‘జిల్‌’ లాంటి హిట్‌ సినిమా ఇచ్చాక రాధాకృష్ణ కుమార్‌ కాస్త ‘జిల్‌’ రాధాకృష్ణ అయ్యారు. ఆ వెంటనే ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్‌’ అనే సినిమా మొదలుపెట్టారు. సినిమాకు వచ్చిన స్టార్టింగ్‌ ట్రబుల్స్‌, బాలారిష్టాలు, రిలీజ్‌ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వీటికి కరోనా పరిస్థితులు యాడ్‌ ఆన్‌ అని చెప్పాలి. సినిమా మీద ఎంతో నమ్మకంగా ఉన్న దర్శకుడు నిరాశపడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అన్ని వాయిదాలు పడింది సినిమా. అయితే సినిమా వచ్చాక పరిస్థితి దారుణంగా మారింది. ఫలితం ఎవరికీ నచ్చలేదు. దీంతో రాధాకృష్ణ డల్‌ అయిపోయారు. తొలి రెండు సినిమాల మధ్య గ్యాప్‌ ఏడేళ్లు కావడం గమనార్హం.

ఇప్పుడు సుమారుగా ఇలాంటి పరిస్థితిలో స్టార్టింగ్‌లో ఉన్నారు బుచ్చిబాబు సానా. ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌కి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు బుచ్చిబాబు. వైష్ణవ్‌ తేజ్‌ – కృతి శెట్టితో తీసిన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని పట్టుపట్టుకుని కూర్చుని ఉన్నారు. అయితే ఎన్టీఆర్‌ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో బుచ్చిబాబుకి డేట్స్‌ ఇచ్చేలా లేడు. కొరటాల సినిమా అయ్యాక, ప్రశాంత్‌ నీల్‌ సినిమా చేయాలి. ఈ రెండూ పూర్తవ్వాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అప్పుడు బుచ్చిబాబు సినిమా స్టార్ట్‌ అయితే రావడానికి ఏడాది పడుతుంది.

దీంతో బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కి, పూర్తయి, విడుదల కావాలంటే కనీసం మూడేళ్లు కావాలి. ఈలోపు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే ఇదంతా. అంటే 2025లో బుచ్చిబాబు రెండో సినిమా వస్తుంది. తొలి సినిమాకు, రెండో సినిమాకు నాలుగేళ్లన్నమాట. ఇది యువ దర్శకుడికి ఏమంత మంచిది కాదు. కాబట్టి ఎన్టీఆర్‌ సినిమా కంటే మరో సినిమా చేసుకోవడం బుచ్చిబాబుకు చాలామంచిది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags